6 బంతుల్లో 6 సిక్సులు

6 బంతుల్లో 6 సిక్సులు

 పాకిస్థాన్ సూపర్ లీగ్ ఎగ్జిబిష‌న్ మ్యాచ్‌లో ఇఫ్తికార్ అహ్మద్ అరుదైన ఘనత సాధించాడు. ఒకే ఓవర్లో ఆరు సిక్సులు బాదాడు. క్వెట్టా గ్లాడియేట‌ర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇఫ్తికార్ అహ్మద్ ..పెషావ‌ర్ జ‌ల్మి ప్లేయ‌ర్ వాహ‌బ్ రియాజ్ బౌలింగ్‌లో ఆరు బంతులను సిక్సులుగా మలిచాడు. రియాజ్ వేసిన 19వ ఓవ‌ర్‌లో ఇఫ్తికార్ దుమ్మురేపాడు. 

ఫస్ట్ బాల్ను  స్క్వేర్ లెగ్ లో సిక్స్గా మలిచాడు. సెకండ్ బాల్ను  స్ట్రెయిట్‌గా స్టాండ్లోకి పంపాడు. మూడో బంతిని బౌల‌ర్ నెత్తిమీది నుంచి కొట్టాడు. దీంతో రౌండ్ ది వికెట్ బౌలింగ్ చేసిన రియాజ్ను...ఇఫ్తికార్ వదల్లేదు. చివరి మూడు బంతులను థ‌ర్డ్ మ్యాన్ దిశ‌గా సిక్సర్లుగా మలిచాడు. మొత్తంగా ఇఫ్తికార్ 50 బంతుల్లోనే 94  పరుగులు సాధించాడు. దీంత క్వెట్టా గ్లాడియేట‌ర్స్‌ 20 ఓవర్లలో 184 ప‌రుగులు చేసింది.