కరోనాకు ఐఐసీటీ మందు

కరోనాకు ఐఐసీటీ మందు

హైదరాబాద్​, వెలుగుహైదరాబాద్​ ఇండియన్​ ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ కెమికల్​ టెక్నాలజీ (ఐఐసీటీ) కరోనా విరుగుడును తక్కువ ఖర్చులో తయారు చేసే సింథటిక్​ పద్ధతి కనుగొంది. కరోనాపై పోరాడే 25 మందులను కౌన్సిల్​ ఆఫ్​ సైంటిఫిక్​ ఇండస్ట్రియల్​ రీసెర్చ్​ గుర్తించింది. ఒకటి ఫావిపిరావిర్​. దీన్ని ఫ్యూజిఫిల్మ్​ తోయామా కెమికల్​ లిమిటెడ్​ అనే కంపెనీ అభివృద్ధి చేసింది. ఇది యాక్టివ్​ ఫార్మా ఇంగ్రీడియంట్​ (ఏపీఐ). ఆ ‘ఫార్ములా’నే ఐఐసీటీ కనుగొంది. తయారీకి దేశీ ఫార్మా కంపెనీ సిప్లాతో ఒప్పందం చేసుకుంది. డెవలప్​ చేశాక క్లినికల్​ ట్రయల్స్​ చేయనుంది సిప్లా కంపెనీ. ‘సిప్లెంజా’ పేరిట మార్కెట్​ చేయనుంది. ఆ మందు తయారీ, క్లినికల్​ ట్రయల్స్​పై డ్రగ్​ కంట్రోలర్​ జనరల్​ ఆఫ్​ ఇండియా (డీసీజీఐ)కి సిప్లా దరఖాస్తు చేసుకున్నట్టు కేంద్ర సైన్స్​ అండ్​ టెక్నాలజీ శాఖ తెలిపింది. ఫావిపిరావిర్​ను ఇన్​ఫ్లుయెంజా వంటి వాటికి వాడుతున్నారని చెప్పింది. అన్ని అనుమతులు వచ్చాక ఐసీఎంఆర్​ గైడ్​లైన్స్​ ప్రకారం కంపెనీ ట్రయల్స్​ చేస్తుందని ప్రకటించింది. చైనా, జపాన్, ఇటలీ దేశాల్లో దీన్ని టెస్ట్​ చేస్తున్నారని చెప్పింది. ట్రయల్స్​ సక్సెస్​ అయితే ఆరు నెలల్లో మందు అందుబాటులోకి వస్తుందని పేర్కొంది. ఫావిపిరావిర్​ను టెస్ట్​ చేసేందుకు డీసీజీఐ అనుమతిచ్చిందని మరో ఫార్మా కంపెనీ గ్లెన్​మార్క్​ వెల్లడించింది. స్ట్రైడ్స్​ ఫార్మా సైన్స్​ లిమిటెడ్​ కూడా ఫావిపిరావిర్​ టాబ్లెట్లు తయారు చేశామని, ట్రయల్స్ కు డీసీజీఐ అనుమతి కోరామని తెలిపింది.