ఉత్తమ నటిగా కృతి: ఐఫా 2022 అవార్డ్స్ విజేతలు వీరే..

ఉత్తమ నటిగా కృతి: ఐఫా 2022 అవార్డ్స్ విజేతలు వీరే..

2022 (IIFA) ఐఫా వేడుకలు అబుదాబిలో అట్టహాసంగా జరిగాయి. బాలీవుడ్తో పాటు ఇతర సినీ ఇండస్ట్రీ నుంచి పలువురు స్టార్స్ ఈ వేడుకకు హాజరై సందడి చేశారు. జూన్ 2, 3 , 4 తేదీల్లో ఈవెంట్స్ జరుగగా.. సల్మాన్ ఖాన్, రితీష్ దేశ్ముఖ్ , మనీష్ పాల్ హోస్టింగ్ చేయడం విశేషం. సర్దార్ ఉదమ్ – మిమీ సినిమాలకు గాను విక్కీ కౌశల్ – కృతి సనన్ ఉత్తమ నటుడు మరియు ఉత్తమ నటిగా అవార్డును అందుకున్నారు.

మొత్తం విజేతల లిస్ట్ చూస్తే..

ఉత్తమ చిత్రం: షేర్షా 

ఉత్తమ దర్శకుడు: విష్ణువర్ధన్‌ (షేర్షా)

ఉత్తమ నటుడు: విక్కీ కౌషల్‌ (సర్దార్‌ ఉద్ధమ్‌)

ఉత్తమ నటి: కృతి సనన్‌ (మిమి)

ఉత్తమ నటుడు (డెబ్యూ): అహన్‌ శెట్టి (తడప్‌ 2)

ఉత్తమ నటి (డెబ్యూ): శర్వారీ వాఘ్‌ (బంటీ ఔర్‌ బబ్లీ 2)

ఉత్తమ సహాయ నటుడు: పంకజ్‌ త్రిపాఠీ (లూడో)

ఉత్తమ సహాయ నటి: సయూ తమ్హాంకర్‌

మ్యూజిక్‌ డైరెక్షన్‌ (టై): ఏఆర్‌ రెహమాన్‌ (ఆత్రంగి రే), తనిష్క్‌ బగ్చీ, జస్లీన్‌ రాయల్‌, జావేద్‌-మోసిన్‌, విక్రమ్‌ మాంత్రోస్‌, బి ప్రాక్‌, జానీ (షేర్షా)

ఉత్తమ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్: జుబిన్‌ నటియాల్‌ (రాతాన్‌ లంబియాన్‌-షేర్షా)

ఉత్తమ బ్యాక్ గ్రౌండ్ సింగర్: అసీస్‌ కౌర్‌ (రాతాన్‌ లంబియాన్‌-షేర్షా)

ఉత్తమ స్టోరీ (ఒరిజినల్‌): అనురాగ్‌ బసు (లూడో)

ఉత్తమ స్టోరీ (అడాప్టెడ్‌): (కబీర్‌ ఖాన్‌, సంజయ్‌ పురాన్‌ సింగ్‌ చౌహన్‌ ఐసీసీ వరల్డ్‌ కప్‌ 1983 ఆధారంగా వచ్చిన 83)

సాహిత్యం: కౌసర్‌ మునీర్‌ (లెహ్రే దో పాట-83)