Dasara IIFA: అవార్డులతో ధూమ్ ధామ్..IIFAలో దసరా ఏకంగా 10 నామినేషన్స్

Dasara IIFA: అవార్డులతో ధూమ్ ధామ్..IIFAలో దసరా ఏకంగా 10 నామినేషన్స్

నేచురల్ స్టార్ నాని (Nani)తో దసరా (Dasara) లాంటి రా అండ్ రస్టిక్ మూవీ తీసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల (Srikanth odela). మొదటి సినిమాతోనే తన సత్తా చాటుకొని బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.100 కోట్లు కొల్లగొట్టాడు ఈ కుర్ర దర్శకుడు. అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాతో ఇండస్ట్రీ మొత్తాన్ని తనవైపుకు తిప్పుకున్నాడు. అలాగే ప్రతిష్ట్మాతకమైన అవార్డుల దృష్టిని కూడా తన సినిమా వైపు చూసేలా చేసేలా చేశాడు. 

ఇటీవల ‘దసరా’ చిత్రం ఫిలింఫేర్ అవార్డుల్లో 6 ప్రతిష్టాత్మక కేటగిరీలలో సత్తా చాటిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ సినిమా IIFA (International Indian Film Academy Awards) అవార్డుల బరిలో ఏకంగా 10 విభాగాల్లో నామినేట్ అయ్యి సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. దీనికి సంబంధించిన వివరాలను చిత్ర మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు.

ALSO READ | మహేష్ వాయిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ముఫాసా .. డిసెంబర్ 20న విడుదల

"ధూమ్ ధామ్ బ్లాక్ బస్టర్..దసరా కొత్త శిఖరాలను కైవసం చేసుకుంటూనే ఉంది..ఈ చిత్రం IIFAలో అత్యధిక నామినేషన్‌లతో అన్ని ప్రధాన అవార్డు కేటగిరీలతో సహా రికార్డ్ 10 విభాగాల్లో నామినేట్ చేయబడింది" అంటూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సినిమా ఇచ్చిన బలంతో డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల నానితో మరో సినిమా లైన్ లో పెట్టేశాడు.  

IIFA నామినేషన్ల జాబితా ::

బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇన్ ది లీడింగ్ రోల్- మేల్
బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇన్ ది సపోర్టింగ్ రోల్- మేల్
బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇన్ ది నెగటివ్ రోల్
బెస్ట్ పిక్చర్
బెస్ట్ లిరిక్స్
బెస్ట్ సింగర్ – ఫిమేల్
బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇన్ ది లీడింగ్ రోల్- ఫిమేల్
బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్
బెస్ట్ డైరెక్టర్