హైదరాబాద్ లో 700 కోట్లతో జంతువుల వ్యాక్సిన్ తయారీ కేంద్రం

హైదరాబాద్ లో 700 కోట్లతో జంతువుల వ్యాక్సిన్ తయారీ కేంద్రం

హైదరాబాద్: నగరంలో జంతువుల వ్యాక్సిన్ తయారీ కేంద్రం ఏర్పాటుకు ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ లిమిటెడ్ ముందుకొచ్చింది. ఇందుకోసం రూ.700 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు సంస్థ ప్రకటించింది. జంతువుల్లో పాదాలు, నోటి ద్వారా సంక్రమించే వ్యాధులకు సంబంధించి వ్యాక్సిన్ ను ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపింది. ఈ వ్యాక్సిన్ తయారీ కేంద్రం ఏర్పాటు ద్వారా దాదాపు 740 మందికి ఉపాధి లభించనుంది. హైదరాబాద్ లో జంతువుల వ్యాక్సిన్ తయారీ కేంద్రం ఏర్పాటు పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.


వ్యాక్సిన్ సెంటర్ ఏర్పాటులో ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ లిమిటెడ్ సంస్థకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని హామీ ఇచ్చారు. ఇక  జంతువుల వ్యాక్సిన్ తయారీ కేంద్రం ఏర్పాటు వల్ల రైతులకు చాలా మేలు జరగనుందని ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కే ఆనంద్ కుమార్ తెలిపారు. వ్యాక్సిన్ తయారీ వల్ల వందల కోట్ల రూపాయల ప్రభుత్వ ఆదాయం ఆదా అవుతుందని ఆయన స్పష్టం చేశారు.