యువత గుండెకేమైంది.. ? హార్ట్​ ఎటాక్​తో ఐఐఎం స్టూడెంట్​మృతి

యువత గుండెకేమైంది.. ? హార్ట్​ ఎటాక్​తో ఐఐఎం స్టూడెంట్​మృతి

కాయా కష్టం చేసుకునే గుండెలురా మావి.. అనేటోళ్లు పెద్దోళ్లు. నిజమే మరి ఉక్కు కండలతో జంతువులని సైతం వేటాడే సామర్థ్యం  వారికి ఉండేది. వారి తిండి, పని, నిద్ర అలాంటిది.  యూత్​ఎక్కువగా ఉన్న ఇండియాలో వారి గుండెలెందుకో బలహీనపడుతున్నాయి. 

హార్ట్​ల కెపాసిటీ నానాటికి తీసికట్టుగా మారుతోంది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎన్నో అడుగులు ముందుకు వేసినా.. ఆరోగ్యంపై అశ్రద్ధే ప్రాణాలమీదకు తీసుకువస్తోందా అంటే నిజమేనంటున్నారు వైద్యులు. తాజాగా మరో విద్యార్థి కార్డియాక్​ అరెస్ట్​తో ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. 

ఈ విషాద ఘటన వివరాలు..  బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్(ఐఐఎంబీ)లో పీజీపీ  చదువుతున్న విద్యార్థి ఆయుష్​(27)కి జులై 26న గుండె పోటు వచ్చింది. గమనించిన  ఫ్రెండ్స్ హాస్పిటల్​కి తరలించారు. 

అప్పటికే అతను మృతి చెందినట్లు  డాక్టర్లు కన్ఫామ్​ చేశారు. ఆయుష్​బిట్స్​పిలానీలో గ్రాడ్యుయేషన్​ కంప్లీట్​ చేశాడు. అతని మృతి పట్ల ఐఐఎంబీ సంఘం సానుభూతి తెలియజేసింది.