ఐఐటీ ఢిల్లీ కరోనా టెస్ట్‌ పద్ధతికి ఓకే

ఐఐటీ ఢిల్లీ కరోనా టెస్ట్‌ పద్ధతికి ఓకే
  • ఆమోదించిన ఐసీఎమ్‌ఆర్‌‌
  •  తగనున్న టెస్ట్‌ల‌ ఖర్చు

న్యూఢిల్లీ: తక్కువ ఖర్చుతో కరోనా టెస్ట్‌ చేసే విధంగా ఐఐటీ – ఢిల్లీ రూపొందించిన కరోనా టెస్ట్‌ పద్ధతిని ఐసీఎమ్‌ఆర్‌‌ ఆమోదించింది. దీంతో కోట్ల జనాభా ఉన్న మన దేశంలో తక్కువ ఖర్చుతోనే టెస్టులు చేయొచ్చు. పీసీఆర్‌‌ బేస్‌ డైయగ్నొస్టిక్‌ సిస్టమ్‌ టెస్ట్‌కు ఐసీఎమ్‌ఆర్‌‌ అప్రూవల్‌ వచ్చిన ఫస్ట్‌ ఎడ్యుకేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఐఐటీ ఢిల్లీనే. ప్రస్తుతం ప్రోబ్‌ బేస్డ్‌ పద్ధతిలో టెస్టులు చేస్తున్నారని, ఐఐటీ టీమ్‌ ‘ప్రోబ్‌ ఫ్రీ’ పద్ధతి ద్వారా టెస్టులు చేసే విధానాన్ని కనిపెట్టిందని అధికారులు చెప్పారు. తక్కువ ఖర్చుతో రిజల్ట్‌ కరెక్ట్‌గా వస్తుందని అన్నారు. “ కరోనా టెస్ట్‌ చేసేందుకు ఐసీఎమ్‌ఆర్‌‌ ఆమోదించిన మొదటి ప్రోబ్‌ఫ్రీ అస్సే ఇది. ఈ పద్ధతిలో టెస్ట్‌ చేసేందుకు ఫ్లోరోసెంట్‌ ప్రోబ్స్‌ అవసరం లేనందున ఈ పరీక్షను సులభంగా స్కేల్‌ చేయొచ్చు. వీలైనంత త్వరగా ఇండస్ట్రియల్‌ పార్టనర్స్‌తో తక్కువ ధరకే కిట్స్‌ను పెద్ద ఎత్తున మార్కెట్‌లోకి తెచ్చే ప్రయత్నం చేస్తాం” అని సీనియర్‌‌ అధికారి ఒకరు చెప్పారు. సామాన్య ప్రజలు కూడా తక్కువ ఖర్చుతో టెస్ట్‌లు చేయించుకోవాలనే ఉద్దేశంతో దీన్ని తయారు చేశామని ఐఐటీ ఢిల్లీ టీమ్‌ చెప్పింది. ప్రొఫెసర్‌‌ వివేకానంద పెరుమాళ్‌ ఆధ్వర్యంలోని పీహెచ్‌డీ స్కాలర్స్‌ టీమ్‌ ఈ కిట్‌ను తయారు చేసింది.