IIT హైదరాబాద్‌లో ఇంటర్న్‌షిప్‌లు.. దరఖాస్తు చేసుకోండి

IIT హైదరాబాద్‌లో ఇంటర్న్‌షిప్‌లు.. దరఖాస్తు చేసుకోండి

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) హైదరాబాద్ సమ్మర్ అండర్ గ్రాడ్యుయేట్ రీసెర్చ్ ఎక్స్‌పోజర్ (SURE) పథకం కింద ఇంటర్న్‌షిప్‌ల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మే- జూలై మధ్య కనిష్టంగా నెల లేదా గరిష్టంగా రెండు నెలల వ్యవధి వరకు ఇంటర్న్‌షిప్ నిర్వహిస్తారు. ఆసక్తిగల అభ్యర్థులు మార్చి 10వ తేదీలోగా ఐఐటీ హైదరాబాద్‌లోని SURE వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవచ్చు.

మొత్తం 200 మందిని ఇంటర్న్‌షిప్‌ల కోసం ఎంపిక చేయనుండగా..  అమ్మాయిల కొరకు 50 సీట్లను రిజర్వ్ చేశారు. షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులకు నెలకు రూ. 7,500 చొప్పున స్టైపండ్ చెల్లిస్తారు. అభ్యర్థులు.. నెల, నెలన్నర లేదా రెండు నెలల కాల వ్యవధిలో ఇంటర్న్‌షిప్‌ పూర్తి చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు ఐఐటీ హైదరాబాద్ విద్యార్థుల హాస్టళ్లలో వసతి కల్పిస్తారు. మెస్ ఛార్జీలు ఇంటర్న్‌లే భరించాలి.

ఎంపిక విధానం

మొదట దరఖాస్తుల ప్రిలిమినరీ స్క్రీనింగ్ ఉంటుంది.  ఆపై సంబంధిత డిపార్ట్‌మెంట్ ఫ్యాకల్టీ వారీగా ఇంటర్వ్యూ (ఆన్‌లైన్ మోడ్) ఉంటుంది. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థుల జాబితాను ఏప్రిల్ 15న ప్రకటిస్తారు. ఎంపికైన అభ్యర్థులకు ఈ -మెయిల్‌ ద్వారా సమాచారం  అందిస్తారు.

అర్హతలు

  • MSc మొదటి సంవత్సరం(గణితం, భౌతిక శాస్త్రం, కెమిస్ట్రీ లేదా జీవశాస్త్రం), లేదా MA మొదటి/రెండు/మూడవ సంవత్సరం, BTech/B.Des(బ్యాచిలర్ అఫ్ డిజైన్) లేదా ఇంటిగ్రేటెడ్ BTech/ MTech ప్రోగ్రామ్ మూడవ/ నాల్గవ సంవత్సరం చదువుతున్న వారు అర్హులు.
  • దరఖాస్తుదారులు మునుపటి సంవత్సరాల్లో సాధించిన CGPA లేదా శాతం అనేది ఆ కళాశాలలో టాప్ 20లో ఉండాలి. అలాగే, దరఖాస్తు సమయంలో ఇన్‌స్టిట్యూట్ హెడ్/ప్రిన్సిపల్ క్రమశిక్షణ, మార్కుల వివరాలను ధృవీకరించబడాలి.
  • ఇంటర్న్‌షిప్ పూర్తయ్యే వరకు పూర్తి సమయం ఉంటానని దరఖాస్తుదారు సమయంలో పొందుపరచాలి. కనీసం ఒక నెల పని చేయాలి. పార్ట్ టైమ్ లేదా ఆన్‌లైన్ ఇంటర్న్‌షిప్ అనుమతించబడదు.
  • నాన్ ఐఐటీ హైదరాబాద్ విద్యార్థులు మాత్రమే ఈ ఇంటర్న్‌షిప్‌ల కోసం దరఖాస్తు చేసుకోవాలి. గమనించగలరు.

దరఖాస్తు చేయాలనుకున్న వారు SRC SURE Form లింక్ పై క్లిక్ చేయండి.