
రామచంద్రాపురం (పటాన్చెరు), వెలుగు: డిజిటల్ యుగంలో ముందుకు సాగాలన్నా, పారిశ్రామిక విప్లవాలు రావాలన్నా ఏఐ, ఆటోమేషన్ తోనే సాధ్యమని ఐఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్ నరహరి శాస్ర్తి అభిప్రాయపడ్డారు. పటాన్చెరు పరిధిలోని గీతం డీమ్డ్ యూనివర్సిటీలో రెండు వారాల పాటు నిర్వహించే నైబర్ భద్రతలో డీప్ ఫేక్ బెదిరింపుల- గుర్తింపు, నివారణ, నైతిక సవాళ్లు అనే వర్క్‌షాప్‌ను ఆయన మంగళవారం ప్రారంభించారు.
ఏఐసీటీఈ, ఏటీఏఎల్ అడ్వాన్స్డ్ పథకం గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ సీఎస్ఈ విభాగం ఈ ఎఫ్డీపీని నిర్వహిస్తోంది. వర్క్‌షాప్ ప్రారంభోత్సవ అనంతరం నరహరి శాస్ర్తి మాట్లాడుతూ ఏఐ, ఎల్ఎల్ఎం వంటి అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీలను మనం స్వీకరించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచానికి దీటుగా ఇండియన్ టెక్నాలజీ అభివృద్ధి చెందుతోందని, ఆవిష్కరణలో దేనికి తీసిపోమన్నారు..