ఐఐటీ జామ్‌‌ 2023 నోటిఫికేషన్‌‌

 ఐఐటీ జామ్‌‌ 2023 నోటిఫికేషన్‌‌

దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీలతోపాటు, ఎన్‌‌ఐటీలు, ఐఐఎస్‌‌ఈఆర్, ఐఐఎస్‌‌సీ సహా.. దాదాపు 30 కేంద్ర ప్రభుత్వ ఇన్‌‌స్టిట్యూట్స్‌‌లో.. ఎమ్మెస్సీ, ఎమ్మెస్సీ + పీహెచ్‌‌డీ కోర్సుల్లో చేరేందుకు నిర్వహించే ఎగ్జామ్​ జాయింట్‌‌ అడ్మిషన్‌‌ టెస్ట్‌‌ ఫర్‌‌ మాస్టర్స్‌‌(జామ్​). ఈ ఎంట్రెన్స్‌‌ టెస్టుకు సంబంధించి ఐఐటీ జామ్‌‌ 2023 నోటిఫికేషన్‌‌ విడుదలైంది.

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్‌‌ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. డిగ్రీలో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి.  

ఎగ్జామ్​ ప్యాటర్న్​: జామ్‌‌ పరీక్ష మొత్తం మూడు విభాగాల్లో జరుగుతుంది. 

సెక్షన్‌‌ ఎ: ఇందులో 30 మల్టిపుల్‌‌ ఛాయిస్‌‌ క్వశ్చన్స్‌‌(ఎంసీక్యూ)ఉంటాయి. ఇందులో 10 ఒక మార్కు ప్రశ్నలు, 20 రెండు మార్కుల ప్రశ్నలు అడుగుతారు.

సెక్షన్‌‌ బి: ఈ విభాగంలో 10 మల్టిపుల్‌‌ సెలక్ట్‌‌ కొశ్చన్స్‌‌(ఎంఎస్‌‌క్యూ) ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు కేటాయించారు. 

సెక్షన్‌‌ సి: ఈ విభాగంలో 20 న్యూమరికల్‌‌ ఆన్సర్‌‌ టైప్‌‌ ప్రశ్నలు అడుగుతారు. వీటిలో 1 మార్కు ప్రశ్నలు 10, అలాగే 2 మార్కుల ప్రశ్నలు 10 ఉన్నాయి. 3 గంటల్లో వంద మార్కులకు 60 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి.  

దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఆన్‌‌లైన్‌‌లో సెప్టెంబర్ 7 నుంచి అక్టోబర్​ 11 వరకు దరఖాస్తు చేసుకోవాలి. పరీక్ష 2023 ఫిబ్రవరి 12న నిర్వహిస్తారు. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్​లో పరీక్ష కేంద్రాలు ఉన్నాయి​. వివరాలకు ‌‌‌‌ www.jam.iitg.ac.in వెబ్​సైట్​ సంప్రదించాలి. 

మరిన్ని వార్తలు