BharOS: మేడిన్ ఇండియా ఓఎస్ రూపొందించిన మద్రాస్ ఐఐటీ

BharOS: మేడిన్ ఇండియా ఓఎస్ రూపొందించిన మద్రాస్ ఐఐటీ

ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఐఐటీ మద్రాస్ దేశీయ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ (OS)ను ఆవిష్కరించింది. దీనికి భార్ ఓఎస్(BharOS) అని పేరు పెట్టారు. ప్రైవసీ, సెక్యూరిటీయే లక్ష్యంగా ఈ ఓఎస్ ను రూపొందించారు. ఐఐటీ మద్రాస్, ప్రవర్తక్ టెక్నాలజీస్ ఫౌండేషన్ కలిసి ఇంక్యుబేట్ చేసిన జాండ్ కే ఆపరేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (JandKops) ఈ ఓఎస్ ను డెవలప్ చేసింది.   

భార్ ఓఎస్ ఇతర ఆపరేటింగ్ సిస్టమ్ ల కన్నా మెరుగైందని ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్ వి. కామకోటి చెప్పారు. ఇది థర్డ్ పార్టీ యాప్స్ ను అనుమతించదని, వైరస్, మాల్వేర్, హ్యాకర్లను నియంత్రిస్తుందని అన్నారు. దేశంలోని 100 కోట్ల మంది మొబైల్ యూజర్ల డేటా భద్రంగా ఉండేలా, వాడుకోవడానికి సౌకర్యంగా ఉండేలా దీన్ని రూపొందించామని వెల్లడించారు. భార్ ఓఎస్ ను కొన్ని కంపెనీలకు ఇచ్చామని, త్వరలో ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు.