
న్యూఢిల్లీ: ఇస్రో చీఫ్ సోమనాథ్ ఐఐటీ మద్రాస్ నుంచి డాక్టరేట్ అందుకున్నారు. శుక్రవారం ఐఐటీ మద్రాస్ 61వ కాన్వొకేషన్ కార్యక్రమంలో ఆయన పట్టా అందుకున్నారు. ఆయన ఇప్పటికే వివిధ వర్సిటీల నుంచి డజనుకు పైగా గౌరవ డాక్టరేట్లు అందుకున్నారు. అయితే, పరిశోధన చేసి అందుకున్న తొలి డాక్టరేట్ కావడంతో సోమ్నాథ్ సంతోషం వ్యక్తంచేశారు.
డాక్టరేట్ స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘ఐఐటీ మద్రాస్ వంటి ప్రతిష్టాత్మక సంస్థ నుంచి పీహెచ్‌డీ పట్టా పొందడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. ఏదో ఒకరోజు ఇక్కడి నుంచి గ్రాడ్యుయేట్ కావాలని కలలు కన్నాను. ఇండియన్ ఇన్స్టిట్యూట్ఆఫ్ సైన్స్ బెంగళూరు నుంచి నేను మాస్టర్స్ డిగ్రీ పొందాను. ఇప్పుడు ఐఐటీ మద్రాస్ ద్వారా పీహెచ్‌డీ అందుకోవడం గౌరవంగా భావిస్తున్నా” అని సోమ్నాథ్ చెప్పారు.