హైదరాబాద్‌ ఐకియా స్టోర్‌లో మహిళపై జాత్యహంకార వివక్ష

హైదరాబాద్‌ ఐకియా స్టోర్‌లో మహిళపై జాత్యహంకార వివక్ష

హైదరాబాద్‌లోని ఐకియా స్టోర్‌లో జాత్యహంకార వివక్ష జరిగిందన్న వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ చర్య భయంకరమైనదని, ఆమోదయోగ్యం కానిదని పేర్కొన్నారు. దయచేసి క్షమాపణను కోరండి అంటూ కేటీఆర్ సూచించారు. తమ స్టోర్ కి వచ్చిన కస్టమర్లతో ఎలా ఉండాలి, వారితో ఎలా ప్రవర్తించాలి అన్న విషయంపై సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని కేటీఆర్ ఈ సందర్భంగా రాసుకొచ్చారు. ఐకియా స్టోర్స్ వారు తమ పద్దతి మార్చుకుంటే చాలా మంచిదని ట్వీట్ చేశారు. ఇక వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లోని ఐకియా స్టోర్‌లో జాత్యహంకార వివక్ష ఎదుర్కొన్నట్టుగా ఓ వ్యక్తి ట్వీట్ చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. 

నితిన్ సేతి అనే వ్యక్తి హైదరాబాద్ ఐకియా స్టోర్ లో జాత్యంహకారం ఎదుర్కొన్నామంటూ ట్వీట్ చేశారు. తన భార్య కొనుగోలు చేసిన వస్తువులను సిబ్బంది తనిఖీ చేశారని, అంతకు ముందు, ఆ తర్వాత కొనుగోలు చేసిన కస్టమర్లను మాత్రం చెక్ చేయలేదని ఆవ్యక్తి ఆరోపించాడు. దీనికి కారణం కేవలం జాతి వివక్షేనని.. సూపర్‌వైజరీ స్టాఫ్ కూడా ఈ చర్యకు మద్దతుగా నిలిచారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇంటర్నేషనల్ స్టోర్ తన బుద్ధి చూపించుకుందని మండిపడ్డారు. దీనికి తోడు రేసిజం అనే హాష్‌టాగ్ ను కూడా జోడించారు. ఈ పోస్ట్ కాస్తా వైరల్ కావడంతో నెటిజన్లు ఐకియా స్టోర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.