ఎంపీగా ప్రమాణం చేసిన ఇళయరాజా

ఎంపీగా ప్రమాణం చేసిన ఇళయరాజా

సంగీత విద్వాంసుడు ఇళయరాజా రాజ్యసభలో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు ఆయనను కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేసింది.  నలభై రెండేళ్ల మ్యూజిక్  కెరీర్‌‌‌‌లో 1,400కు పైగా సినిమాలకు ఇళయరాజా సంగీతాన్ని సమకూర్చారు. 7 వేలకి పైగా పాటలకు సంగీతం ఇచ్చారు. 20 వేలకు పైగా కాన్సర్ట్స్ నిర్వహించారు. నాలుగుసార్లు జాతీయ అవార్డు అందుకున్నారు. 1988లో అప్పటి తమిళనాడు సీఎం కరుణానిధి.. ఇళయరాజాకి ఇసైజ్ఞాని (సంగీత జ్ఞాని) అనే బిరుదు ఇచ్చారు. కేంద్రం పద్మవిభూషణ్, పద్మభూషణ్ ​తో సత్కరించింది.

14 ఏళ్ల వయసు నుంచే..

ఇళయరాజా మద్రాస్ ప్రెసిడెన్సీలోని పణ్నైపురంలో 1943 సంవత్సరం జూన్‌‌ 3న పుట్టారు. 14 ఏళ్ల వయసు నుంచే తన అన్నయ్య నడిపే మ్యూజికల్ ట్రూప్‌‌తో కలిసి పని చేశారు. ఓ ప్రొఫెసర్ దగ్గర వెస్టర్న్ క్లాసికల్ మ్యూజిక్‌‌లో టెక్నిక్స్ నేర్చుకున్నారు. ఇన్‌‌స్ట్రుమెంటల్ పర్‌‌‌‌ఫార్మెన్స్ గురించి స్టడీ చేశారు. కర్నాటక సంగీతాన్ని అవపోసన పట్టారు. క్లాసికల్ గిటార్‌‌‌‌లో గోల్డ్ మెడల్ సాధించారు. లండన్‌‌లోని ట్రినిటీ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్‌‌ నుంచి సంగీత దర్శకుడు జీకే వెంకటేష్‌‌ దగ్గర అసిస్టెంట్‌‌గా పని చేసే అవకాశం సంపాదించారు. పలు సినిమాలకు అసిస్టెంట్‌‌గా పని చేశాక, 1976లో ‘అన్నక్కిళి’ అనే సినిమాకి సోలో మ్యూజిక్ డైరెక్టర్‌‌‌‌గా పని చేసే చాన్స్ దొరికింది. తమిళ సినీ చరిత్రలో దీన్నో కల్ట్ క్లాసిక్‌‌గా చెబుతుంటారు. ఆ చిత్రానికి వర్క్ చేసిన తర్వాత ఇక వెనుదిరిగి చూసుకోలేదు.