ఆస్పత్రి పాలైన గోవా బ్యూటీ

ఆస్పత్రి పాలైన గోవా బ్యూటీ

ఈ మధ్య కాలంలో సినీ పరిశ్రమలో ఉండే పెద్ద పెద్ద హీరోయిన్లు వరుసగా అనారోగ్యం బారిన పడుతున్నారు. మరికొందరు తమకు ఎప్పటి నుంచో ఉన్న అనారోగ్య సమస్యల గురించి అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు. తాజాగా.. గోవా బ్యూటీ ఇలియానా అనారోగ్య కారణాలతో ఆస్పత్రి పాలైంది. ప్రస్తుతం తాను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఇలియానా తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో చెప్పింది. IV ఫ్లూయిడ్స్ తీసుకుంటున్న ఫొటోలను పోస్ట్ చేసింది."కాలం ఎంత విచిత్రమైనది. ఒక్కరోజులో ఇలా మారిపోయింది. 3 బ్యాగుల ఐవీ ఫ్లూయిడ్స్‌తో మంచి డాక్టర్ల మధ్యలో ఉన్నాను అంటూ ఇలియానా పోస్టు చేసింది. తన ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతూ తనకు మెసేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు చెప్పింది. మీ ప్రేమకు ఏమిచ్చినా రుణం తీరదు అని రాసింది. తన ఆరోగ్యం ఇప్పుడు బాగానే ఉందని చెప్పింది. సరైన సమయంలో మంచి వైద్యం పొందండి. మీ అందరికీ ఇదే నా సలహా అంటూ" ఇన్ స్టాలో పోస్టు పెట్టింది. 

అప్పట్లో దేవదాసు, పోకిరి, జల్సా.. ఇలా సూపర్ హిట్ సినిమాల్లో ఇలియానా నటించింది. ఆ తర్వాత బాలీవుడ్‌కి జంప్ అయింది. అక్కడ కూడా కొన్ని సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. అయితే గత కొంత కాలంగా వెండితెరకు దూరంగా ఉన్న ఇలియానా.. ప్రస్తుతం అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఇక ఇలియానా త్వరలో 'తేరా క్యా హోగా లవ్లీ' అనే సినిమాలో కనిపించనుంది. ఆమె మొదటిసారిగా రణదీప్ హుడాతో నటించనుంది. దీంతో పాటు విద్యాబాలన్, ప్రతీక్ గాంధీ నటిస్తున్న ఓ చిత్రంలో కూడా ఇలియానా కీలక పాత్రలో నటిస్తోంది.