మంచిర్యాల రిజిస్ట్రార్ ఆఫీసులో అక్రమ వసూళ్ల దందా

మంచిర్యాల రిజిస్ట్రార్ ఆఫీసులో అక్రమ వసూళ్ల దందా

మంచిర్యాల రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు అధికారులు. సింగరేణి స్థలాల్లో నిర్మించుకున్న ఇండ్ల రిజిస్ట్రేషన్ కోసం ఒక్కొక్కరి నుండి అక్రమంగా రెండు వందల రూపాయలు వసూళ్లు చేస్తున్నారు రిజిస్ట్రేషన్ సిబ్బంది. మార్చి 27వ తేది సోమవారం రాత్రి దాదాపు 10 మంది నుండి రెండు వందల చొప్పున.. ఇరవై వేల రూపాయలు వసూలు చేశారు.

ఇలా ఇప్పటివరకు లక్షల రూపాయలు అక్రమంగా వసూళ్లు చేసినట్టు తెలుస్తోంది.అధికారుల ఆదేశాలతోనే ఈ అక్రమ వసూళ్లు చేస్తున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. చలాన్లు, దస్తావేజుల కోసం సైతం రెండు వందల నుంచి మూడు వందల రూపాయల వరకు ఎక్కువగా తీసుకుంటున్నారు. రెవిన్యూ అధికారులు, రిజిస్ట్రార్ కళ్ల ముందే అక్రమ వసూళ్ల దందా సాగుంతోంది. అక్రమ వసూళ్లు అందరూ కలిసి పంచుకుంటారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.