అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలి..చందానగర్ టౌన్ ప్లానింగ్ ఏసీపీకి జనం కోసం స్వచ్ఛంద సంస్థ ఫిర్యాదు

అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలి..చందానగర్ టౌన్ ప్లానింగ్ ఏసీపీకి  జనం కోసం స్వచ్ఛంద సంస్థ ఫిర్యాదు
చందానగర్, వెలుగు: ఎలాంటి అనుమతులు లేకుండా చేపట్టిన అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని జనం కోసం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్​రెడ్డి డిమాండ్​ చేశారు. గురువారం జీహెచ్​ఎంసీ చందానగర్ సర్కిల్​ డిప్యూటీ కమిషనర్​ శశిరేఖ, టౌన్​ ప్లానింగ్​ ఏసీపీ నాగిరెడ్డికి ఫిర్యాదు చేశారు. 

ఆయన మాట్లాడుతూ.. చందానగర్​ సర్కిల్​ హుడా కాలనీ సర్వే నంబర్​ 366లో 261.32 గజాల స్థలంలో అనుమతి లేకుండా అక్రమ నిర్మాణం చేపడుతున్నారని ఆరోపించారు. సదరు నిర్మాణాన్ని పరిశీలించడానికి వెళ్లిన టౌన్​ ప్లానింగ్​ అధికారులపై నిర్మాణదారుడు తీవ్ర పదజాలంతో దూషించి బెదిరింపులకు పాల్పడ్డారన్నారు. ఆయన వద్ద పలువురు అధికారులు లంచం పుచ్చుకుని వదిలేస్తున్నారని విమర్శించారు.