దుబాయి నుంచి సాక్సుల్లో బంగారం తరలింపు

దుబాయి నుంచి సాక్సుల్లో బంగారం తరలింపు

హైదరాబాద్ : అక్రమ బంగారం రవాణా కొత్త పుంతలు తొక్కుతోంది. ముఖ్యంగా విదేశాల నుంచి తీసుకొచ్చేందుకు కొత్తకొత్త మార్గాలు కనిపెడుతూ సవాల్ విసురుతున్నారు. ఈ మధ్య ఓ ప్రయాణికుడు దుబాయ్ నుంచి బనియన్ లో సుమారు కిలో బంగారం దాచి కుట్టేసి..తీసుకొస్తుండగా శంషాబాద్ ఎయిర్ పోర్టులో పట్టుకున్నారు. కస్టమ్స్ అధికారులకు అనుమానం వచ్చి.. తనిఖీ చేయగా బంగారం బయటపడిన విషయం తెలిసిందే.

తాజాగా సాక్సుల్లో బంగారం దాచుకుని దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడిని శంషాబాద్ ఎయిర్ పోర్టు కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. మొత్తం 957 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బంగారం విలువ సుమారు 46లక్షల 53 వేలు ఉంటుందని అధికారులు తెలిపారు.