- పిండి పట్టి బ్రాండెడ్పిండి పేరుతో అమ్మకాలు
కుత్బుల్లాపూర్, వెలుగు : సిటీకి పంజాబ్రేషన్షాపుల్లోని గోధుమలను తీసుకువచ్చి పిండి పట్టించి మంచి కంపెనీ గోధుమ పిండి అంటూ సంచుల్లో ప్యాక్‌చేసి అమ్ముతున్నాడు. ఇలాంటి దందా చేస్తున్న ఓ వ్యక్తిని పేట్‌బషీరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. సుభాష్‌నగర్‌కి చెందిన రమేశ్ అగర్వాల్ (40) పంజాబ్‌లో రేషన్ షాపుల్లో ఇచ్చే గోధుమలను అక్రమంగా తీసుకువచ్చి ఇక్కడ స్టోర్చేస్తున్నాడు.
అక్కడ ఇంతకుముందు రూ.2కు కిలో ఇచ్చేవారు. ఇప్పుడు ఉచితంగానే ఇస్తుండడంతో అక్కడి జనాలు అమ్ముకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. దీంతో ఇలాంటి వాటిని గుర్తించి తక్కువ ధరకు కొని సిటీకి తీసుకువచ్చి నిల్వ చేస్తున్నాడు. పిండి పట్టించి ప్యాక్‌చేసి ‘దర్శన’ కంపెనీ గోధుమ పిండి అంటూ కిలో రూ. 40కి అమ్ముతున్నాడు. పోలీసులకు సమాచారం అందడంతో గురువారం నిల్వ ఉంచిన 51 సంచుల గోధుమలను సీజ్‌చేసి సివిల్ సప్లయీస్అధికారులకు ఫిర్యాదు చేశారు .
