
సింగరేణి సంస్థ రామగుండం ఏరియా పరిధిలోని మూసివేసిన మేడిపల్లి ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్ట్‌లో మట్టి దొంగలు పడ్డారు. ప్రైవేటు వెంచర్‌కు అనుమతులు లేకుండా వందల టిప్పర్ల మట్టిని తరలిస్తున్నారు. మేడిపల్లి ఓసీపీలో 1996 నుంచి 2022 వరకు బొగ్గును వెలికితీశారు. మొత్తం 60.67 మిలియన్ టన్నుల బొగ్గును వెలికితీయడానికి 335 మిలియన్క్యూబిక్ మీటర్ల మట్టిని తొలగించి పక్కనే కుప్పలుగా పోశారు.
తర్వాత ఈ మట్టిని కందకాల్లో నింపి మొక్కలు నాటి సంరక్షించడం సింగరేణి బాధ్యత. కానీ కొందరు నిబంధనలను తుంగలో తొక్కి సింగరేణి సంస్థ తమదే అన్నట్లుగా రాత్రీ పగలు తేడా లేకుండా మట్టిని సొంత అవసరాలకు తరలిస్తున్నారు. ప్రొక్లయిన్లతో తవ్వుతూ ప్రతిరోజూ 20 టిప్పర్లతో మల్కాపురంలోని వెంచర్‌కు మట్టిని తరలిస్తున్నా సింగరేణి విజిలెన్స్ విభాగం పట్టించుకోవడం లేదు. -గోదావరిఖని, వెలుగు :