వరంగల్ లో అక్రమంగా ఇసుక దందా.. పలువురిపై కేసు నమోదు : సీపీ రంగనాథ్ 

వరంగల్ లో అక్రమంగా ఇసుక దందా.. పలువురిపై కేసు నమోదు : సీపీ రంగనాథ్ 

వరంగల్ లో ఇసుక దందా జోరుగా జరుగుతోంది. నకిలీ వేబిల్స్ తో అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న వరంగల్ సీపీ ఏవీ రంగనాథ్ ఇసుక అక్రమ రవాణాపై దర్యా్ప్తు చేపట్టారు. ఇందులో భాగంగా అక్రమ దందా నడుపుతున్న లారీ ఓనర్లపై కేసు నమోదు చేసి, రవాణాకు పాల్పడిన లారీలను సీజ్ చేశారు. 

జిల్లాలో ఎక్కడ చూసినా నకిలీ వేబుల్స్ తో అక్రమ ఇసుక రవాణా జరుపుతున్నారని, వాళ్లపై తగిన చర్యలు తీసుకుంటామని సీపీ రంగనాథ్ అన్నారు. దీనికోసం టాస్క్ ఫోర్స్ తో కలిసి సంయుక్తంగా రైడ్స్ జరుపుతున్నట్లు రంగనాథ్ తెలిపారు. 

నకిలీ ఇసుక రావాణా వరంగల్ నుంచి పక్క రాష్ట్రాలకు తరలిస్తున్నారని రంగనాథ్ తెలిపారు. దీనివల్ల రాష్ట్రానికి నష్టం ఏర్పడుతుందని వెల్లడించారు. ఫేక్ బిల్స్ తో దందా నడుపుతున్న వాళ్ల ల్యాప్ టాప్స్ స్వాధీనం చేసుకున్నామని, అందులో 15వందలకు పైగా ఫేక్ బిల్స్ ను గుర్తించినట్లు రంగనాథ్ తెలిపారు. ఈ దర్యాప్తును మరింత ముమ్మరం చేసి వీలైనంత మందిని పట్టుకొని ఇసుక దందాని ఆపే ప్రయత్నం చేస్తున్నట్లు రంగనాథ్ వెల్లడించారు.