V6 News

ఎన్నికలు సజావుగా సాగేందుకు సహకరించండి : డీఎస్పీ ఎన్. చంద్రభాను

ఎన్నికలు సజావుగా సాగేందుకు సహకరించండి : డీఎస్పీ ఎన్. చంద్రభాను
  • ఇల్లెందు డీఎస్పీ ఎన్. చంద్రభాను 

టేకులపల్లి, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా సాగేందుకు అన్ని రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని ఇల్లెందు డీఎస్పీ చంద్రభాను, టేకులపల్లి సీఐ బత్తుల సత్యనారాయణ, బోడు ఎస్సై పి. శ్రీనివాసరెడ్డి కోరారు. సోమవారం సంపత్ నగర్ గ్రామంలో వివిధ పార్టీల నాయకులు, ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగేలా చూడాలన్నారు. 

శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. పోలీసుల సూచనలు పాటిస్తూ, ఎన్నికల నియమావళికి కట్టుబడి ఉండాలని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రచారం నిర్వహించుకోవాలని సూచించారు. సమస్యాత్మక అంశాలపై పోలీసులు నిఘా ఉంచారని, అందరూ బాధ్యతయుతంగా వ్యవహరించాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, వివిధ పార్టీల నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.