బీఫ్పై సిద్ధరామయ్య సంచలన వ్యాఖ్యలు

బీఫ్పై సిద్ధరామయ్య సంచలన వ్యాఖ్యలు

కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను హిందువునని..ఇప్పటి వరకు గోమాంసం తినలేదని..కావాలంటే బీఫ్ తింటానని చెప్పి..బీఫ్ బ్యాన్ వివాదానికి తెరలేపారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) మతాల మధ్య అడ్డుగోడలు నిర్మిస్తోందని ఆరోపించారు. తాను బీఫ్ కావాలంటే తింటానని...ప్రశ్నించడానికి మీరెవరు అని తుమకూరులో జరిగిన ఓ కార్యక్రమంలో సిద్ధరామయ్య అన్నారు.  గోమాంసం తినేవాళ్లు కేవలం ఒక వర్గానికి చెందినవారు కాదన్నారు. హిందువులు,క్రైస్తవులు కూడా బీఫ్ తింటారని చెప్పారు. ఇదే విషయంపై గతంలో కర్ణాటక అసెంబ్లీలో కూడా చెప్పానన్నారు. 

మరిన్ని వార్తల కోసం

త్రిముఖ వ్యూహంతో పోరుకు సై

కేసీఆర్​ వెనక్కి రావడంపై సందేహాలు !