హైదరాబాద్ లో ఉమెన్ ఎంటర్‌‌‌‌‌‌‌‌ ప్రెన్యూర్స్ ఎగ్జిబిషన్ షురూ

హైదరాబాద్ లో  ఉమెన్ ఎంటర్‌‌‌‌‌‌‌‌ ప్రెన్యూర్స్ ఎగ్జిబిషన్ షురూ

హైదరాబాద్​, వెలుగు: ఐఎంసీ లేడీస్ వింగ్ తన 38వ ఉమెన్ ఎంటర్‌‌‌‌‌‌‌‌ప్రెన్యూర్స్ ఎగ్జిబిషన్‌‌‌‌ను హైదరాబాద్​లో శనివారం ప్రారంభించింది. ఇది ఆదివారం కూడా కొనసాగుతుంది. భారతదేశం నలుమూలల నుంచి వచ్చిన మహిళా పారిశ్రామికవేత్తలు.. ఫ్యాషన్, నగలు, జీవనశైలి, డిజైన్‌‌‌‌‌‌‌‌లో అత్యుత్తమ ఉత్పత్తులను ఈ సందర్భంగా ప్రదర్శించారు. 

ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బ్రాహ్మణి నారా వచ్చారు. మహిళల నాయకత్వంలోని సంస్థలను బలోపేతం చేయడంలో, ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో ఈ కార్యక్రమం పాత్రను ఆమె అభినందించారు.  ఈ సందర్భంగా 100కు పైగా క్యూరేటెడ్ స్టాల్స్‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేశారు.