ఒకవైపు వర్షాలు.. మరోవైపు వడగాల్పులు..ఈ మండలాలకు వాతావరణ శాఖ హెచ్చరిక

ఒకవైపు వర్షాలు.. మరోవైపు వడగాల్పులు..ఈ మండలాలకు వాతావరణ శాఖ హెచ్చరిక

ఏపీలో గత కొన్ని రోజులుగా అక్కడక్కడా వర్షాలు కురుస్తుంటే మరోవైపు ఎండలు మండిపోతున్నాయి. రోహిణి కార్తె కూడా రావటంతో ఎండా తీవ్రత మరింత పెరిగింది. ఈ క్రమంలో పలు మండలాల్లో వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. సోమవారం ( మే 7 )న 72మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 200మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ.

శ్రీకాకుళం జిల్లాలో 3మండలాలు, విజయనగరంలో 17, పార్వతీపురం మన్యంలో10, అల్లూరి సీతారామరాజు జిల్లాలో2, అనకాపల్లిలో 2, కాకినాడలో 6, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 2, తూర్పుగోదావరి జిల్లాలో 17, పశ్చిమ గోదావరి జిల్లాలో 3, ఏలూరులో 7, కృష్ణా జిల్లాలో2, బాపట్ల కొల్లూరు మండలంలో తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ.

మంగళవారంనాడు 165 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 149 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.అవసరమైతేనే బయటకి వెళ్లాలని, బయటకు వెళ్లే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది వాతావరణ శాఖ.