
దసరా పండగ వచ్చేసింది.. స్కూళ్లకు ఆల్రెడీ సెలవులు కూడా ఇచ్చేశారు. ఎప్పుడెప్పుడు ఊళ్లకు వెళ్లి పండగ సెలవులు ఎంజాయ్ చేద్దామా అని పిల్లలు ఎదురుచూస్తున్నారు.ముఖ్యంగా హైదరాబాద్ లో సెటిలైన ఫ్యామిలీస్ ఊళ్లకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. ఇక వీకెండ్ కూడా రావడంతో లీవ్స్ ప్లాన్ చేసుకొని ఏపీలోని తమ ఊళ్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారా..? అయితే ఈ అలర్ట్ మీకోసమే... వాతావరణ శాఖ కీలక సూచన చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం కారణంగా ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ.
బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని.. ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. కోస్తాంధ్ర, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది వాతావరణ శాఖ. ఈ క్రమంలో కలెక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు హోమ్ మంత్రి అనిత.ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కునేందుకు క్షేత్రస్థాయిలో అధికారులు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు మంత్రి అనిత.
అవసరమైన ప్రతిచోట కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని.. ప్రమాదకర పాయింట్లలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు మంత్రి అనిత. సహాయక చర్యలకు NDRF, SDRF, పోలీసు, ఫైర్ సిబ్బంది సిద్ధంగా ఉంచాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ క్రమంలో మత్స్యకారులు వేటకు వెళ్లోద్దని సూచించారు అధికారులు.పొంగిపొర్లే కాలువలు, రోడ్లు దాటే ప్రయత్నం చేయద్దని.. ఈదురుగాలులు వీచే సమయంలో చెట్లు క్రింద, శిధిలావస్థలో ఉన్న వాటి దగ్గర నిలబడద్దని సూచించారు అధికారులు.