దసరా రోజు బంగాళాఖాతంలో వాయుగుండం...

దసరా రోజు బంగాళాఖాతంలో వాయుగుండం...

బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడుతుంది. దసరా రోజు అంటే 2025, అక్టోబర్ 2వ తేదీన ఈ వాయుగుండం.. పశ్చిమ ప్రాంతంలో అంటే.. ఒడిశా, ఏపీ సరిహద్దుల్లో ఈ వాయుగుండం కేంద్రీక్రుతం అవుతుంది. ప్రస్తుతం అల్పపీడనంగా ఇది.. మరో 48 గంటల్లో బలపడి వాయుగుండంగా మారుతుంది. ఇది తుఫాన్ గా మారే అవకాశం లేదని.. ఒడిశా, ఏపీ సరిహద్దుల్లోనే వాయుగుండంగా తీరం దాటనుందని స్పష్టం చేసింది వాతావరణ శాఖ. 

ఈ వాయుగుండం ప్రభావంతో.. ఏపీలోని ఉత్తరాంధ్ర, కోస్తా, విజయవాడ, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నట్లు వెల్లడించింది వాతావరణ శాఖ. అక్టోబర్ 5వ తేదీ వరకు మోస్తరు వర్షాలు పడతాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది వెదర్ డిపార్ట్ మెంట్. 

బంగాళాఖాతంలోని వాయుగుండం ప్రభావం తెలంగాణపైనా ఉంటుందని.. ఇది స్వల్పంగానే ఉంటుందని.. ఉత్తర తెలంగాణలో మోస్తరు వర్షాలు పడతాయని ఏపీ వాతావరణ శాఖ వెల్లడించింది. 

రానున్న మూడురోజులు వాతావరణం:

తెలంగాణవ్యాప్తంగా ఇవాళ, రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ.రానున్న మూడురోజుల పాటు పలు జిల్లాల్లో 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలితో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. 

వర్షాలు కురిసే ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అవసరమైతేనే బయటికి వెళ్లాలని సూచించింది వాతావరణ శాఖ. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.