ఎల్లో అలర్ట్ : రేపు, ఎల్లుండి (4,5 తేదీల్లో) హైదరాబాద్ లో భారీ వర్షం

ఎల్లో అలర్ట్ : రేపు, ఎల్లుండి (4,5 తేదీల్లో) హైదరాబాద్ లో భారీ వర్షం

హైదరాబాద్ లో మరో రెండు రోజులు(జూలై 4,5తేదీల్లో) భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అత్యవసరం అయితే తప్ప జనం బయటకు రావొద్దని  ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది.

హైదరాబాద్‌లోని మొత్తం ఆరు జోన్‌లు అంటే చార్మినార్, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, ఎల్‌బీ నగర్, సికింద్రాబాద్, శేరిలింగంపల్లిలో ఆకాశం మేఘావృతమై ఉంటుందని ఆ శాఖ తెలిపింది. జూలై3 న నగరంలో సాయంత్రం లేదా రాత్రి సమయంలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని డిపార్ట్‌మెంట్ అంచనా వేసింది.

గడిచిన 24 గంటల్లో వికారాబాద్‌లో అత్యధికంగా 163.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (టీఎస్‌డీపీఎస్) ప్రకారం హైదరాబాద్, జూబ్లీహిల్స్‌లో అత్యధికంగా 28.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.