
తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు పడతాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో కొనసాగుతోన్న ద్రోణుల కారణంగా జూన్ 10,11,12న మూడు రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని చెప్పింది వాతావరణ శాఖ.
జూన్ 10, 11న రేపు ఎల్లుండి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులు, గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగం తో ఈదురుగాలులు వీచే అవకాశం. ఈ రోజు మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
జూన్ 10న ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈదురు గాలులు గంటకు 40- నుంచి 50 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉంది.
జూన్ 11న జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వికారాబాద్, మహబూబ్ నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు గంటకు 40-నుంచి50 కి. మీ వేగంతో వీయనున్నాయి. అన్ని జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.