న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థపై అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సానుకూల అంచనాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి రేటు అంచనాను 7.3 శాతానికి పెంచింది. గతేడాది అక్టోబర్‌లో వేసిన అంచనా కంటే ఇది 0.7 శాతం ఎక్కువ. అలాగే 2026–27 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధిని 6.4 శాతానికి సవరించింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 7.4 శాతంగా ఉండవచ్చని పేర్కొంది. ఆహార ధరలు తగ్గడం వల్ల 2025 నుంచి ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చే అవకాశం ఉందని తెలిపింది. 2026లో ప్రపంచ వృద్ధి రేటు 3.3 శాతంగా ఉంటుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది.
