హీరోకి జెండర్‌‌ ఉండదు

హీరోకి జెండర్‌‌ ఉండదు

మనది హీరో బేస్డ్ ఇండస్ట్రీ అన్నది ఎవరూ కానదలేని వాస్తవం. కానీ ఇప్పుడు ట్రెండ్ మారుతున్నట్టుగా కనిపిస్తోంది. హీరోయిన్లకి ప్రాధాన్యత బాగా పెరుగుతోంది. అయితే కేవలం హీరోయిన్‌‌ మీద మాత్రమే డిపెండ్ అయ్యి సినిమాలు తీసే పరిస్థితి మాత్రం ఇంకా పూర్తిగా రాలేదు. కానీ త్వరలోనే వస్తుంది అంటోంది తాప్సీ. హీరోతో పని లేకుండా తన చుట్టూ తిరిగే కథలతో దూసుకుపోతోందామె. ఆ చిత్రాలు విజయం సాధించడంతో ఆమె పేరు బాలీవుడ్​లో మారు మోగుతోంది. అందుకే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మార్పు ఇప్పటికి వచ్చింది అంటోంది. ‘హీరో అన్న పదానికి జెండర్‌‌‌‌ లేదు. ఆడయినా మగయినా ఒకటే. ఇద్దరూ సినిమాని సమానంగా నడిపించ గలరు. కానీ ఎన్నో యేళ్లుగా మనం హీరో అంటే మగాడేనన్న భావనను ప్రేక్షకుల మనసుల్లో ముద్రించేశాం.  ఇప్పుడది మారుతోంది. ఇప్పటి హీరోయిన్లు ఆ ఆలోచనను మెల్లగా మారుస్తున్నారు’ అంటూ రీసెంట్​గా కామెంట్ చేసింది తాప్సీ.  ఇప్పటికే చాలామంది హీరోయిన్స్ సినిమా సక్సెస్​కి తామూ కారకులవుతున్నారని, త్వరలోనే కమర్షియల్‌‌ సినిమాలను హీరోయిన్లు కూడా నిలబెట్టగలిగే రోజు వస్తుందని కాన్ఫిడెంట్‌‌గా చెబుతోంది తాప్సీ. అది నిజమే కావచ్చు. పింక్, బద్‌‌లా, గేమ్‌‌ ఓవర్‌‌‌‌ వంటి చిత్రాలతో ఆమె దాన్ని ఆల్రెడీ ప్రూవ్ చేసింది. ప్రస్తుతం మరో రెండు ఫిమేల్ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తోంది. మిగతా హీరోయిన్లు కూడా ఆమె దారిలోనే సాగితే సినీ రంగంలో హీరోయిన్ల హవా మరింత పెరిగే చాన్స్ లేకపోలేదు.