Health Alert : థైరాయిడ్.. మనిషిని కొంచెం కొంచెంగా చంపేస్తుందా..!

Health Alert : థైరాయిడ్.. మనిషిని కొంచెం కొంచెంగా చంపేస్తుందా..!

శరీరంలోని ఆర్గాన్స్ సరిగా పనిచేయడానికి ఎండోక్రైన్, ఎక్సోక్రైన్ గ్లాండ్స్ సాయం చేస్తాయి. ఇవి విడుదల చే సే హార్మోన్లలో ఏమాత్రం తేడా వచ్చినా ఆ ఎఫెక్ట్ ఆరోగ్యం మీద పడుతుంది. అలాంటిదే థైరాయిడ్ గ్లాండ్. మెదడు చురుకుగా ఉండాలన్నా, ఎత్తు పెరగాలన్నా ఈ గ్లాండ్ సరిగ్గా పనిచేయాలి. అంతేకాదు మెటబాలిజం సరిగ్గా జరగాలన్నా కూడా ఈ గ్లాండ్ నుంచి విడుదలయ్యే థైరాక్సిన్ హార్మోన్ చాలా అవసరం. అందుకే థైరాయిడ్ సమస్యలు రాకుండా చూసుకోవాలి. ఒకవేళ సమస్య వస్తే గనుక తొందరగా గుర్తించి, ట్రీట్మెంట్ తీసుకోవడం చాలాముఖ్యం అంటున్నారు డాక్టర్లు.

మెదడు ముందు భాగంలో చిన్న సీతాకోక చిలుకంత సైజ్ లో ఉంటుంది థైరాయిడ్ గ్లాండ్. దీని నుంచి థైరాక్సిన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. అన్ని ఆర్గాన్స్ సరిగా పనిచేయాలంటే ఈ హార్మోన్ లెవల్స్ బ్యాలెన్ గా ఉండాలి. థైరాయిడ్ గ్లాండ్ ఎఫెక్ట్ అప్పుడే పుట్టిన పిల్లలు, టీనేజర్స్ నుంచి పెద్దవాళ్ల వరకు ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. ఏ వయసులోనైనా ఏ సమస్యా రాకూడదంటే థైరాక్సిన్ హార్మోన్ బ్యాలెన్స్ ముఖ్యం. 

ఈ హార్మోన్ ఉపయోగాలివి... 

• పుట్టిన పిల్లలలకు మొదటి రెండేండ్లు బ్రెయిన్ డెవలప్మెంట్కు థైరాక్సిన్ చాలా అవసరం. పుట్టుకతోనే హైపోథైరాయిడిజం ఉన్న పిల్లల్ని గుర్తించడం కోసం మూడు లేదా నాలుగో రోజున 'న్యూ బోర్న్ స్క్రీనింగ్' చేయాలి. అయితే, ఈ సమస్య నాలుగు వేల మందిలో ఒకరికి వచ్చే ఛాన్స్ ఉంది. 

• పిల్లలు ఎత్తు పెరగడానికి గ్రోత్ హార్మోన్తో పాటు థైరాక్సిన్ కూడా ముఖ్యం. కొందరు పిల్లలు తోటి పిల్లల కంటే ఎత్తు, బరువు తక్కువ ఉంటారు. గ్రోత్ హార్మోన్ నార్మల్ ఉన్నా కూడా పిల్లలు ఎత్తు పెరగరు. అంతేకాదు కొంతమంది అమ్మాయిల్లో ప్యూబర్టీ ఆలస్యమవుతుంది. కారణం.. థైరాక్సిన్ సరిగా ప్రొడ్యూస్ కాకపోవడమే. 

• ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత థైరాయిడ్ టెస్ట్ చేసుకోవాలి. దాంతో అబార్షన్ అయ్యే ఛాన్సులు తగ్గుతాయి. అంతేకాదు నార్మల్ డెలివరీ అవకాశం ఉంటుంది కూడా. ఒకవేళ థైరాయిడ్ గ్లాండ్ సైజ్లో తేడా వచ్చిందనుకోండి ... 

ట్రీట్మెంట్..

హైపోథైరాయిడిజం ఉన్నవాళ్లు జీవితాంతం థైరాయిడ్ ట్యాబ్లెట్లు వాడాల్సి ఉంటుంది. హైపర్ థైరాయిడిజం ఉన్నవాళ్లు యాంటీ థైరాయిడ్ మెడిసిన్స్ వాడాల్సి ఉంటుంది. హైపర్ థైరాయిడిజం తగ్గడానికి రెండేండ్లు ట్యాబ్లెట్లు వాడాలి. అయితే ట్యాబ్లెట్స్ తో నయం కాకుంటే రేడియో అయోడిన్ థెరపీ ( నోటి ద్వారా చుక్కల మందు) ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. సర్జరీ ఆప్షన్ కూడా ఉంది. అయితే, యాంటీ థైరాయిడ్ డ్రగ్స్ నే ఈ సమస్య చాలా వరకు తగ్గిపోతుంది. అయితే, వీళ్లు హైపో థైరాయిడిజం బారిన పడతారు. థైరాయిడ్ ఉన్న వాళ్లకు మిగతా ఆరోగ్యసమస్యలు ఉన్నవాళ్లలా ఫలానా ఫుడ్ తినొద్దు? ఫలనావే తినాలనే రిస్ట్రిక్షన్స్ లేవు.

హైపోథైరాయిడిజం.. 

హైపర్ థైరాయిడిజం, గాయిటర్, నాడ్యూల్, గ్రేవ్స్ డిసీజ్ వంటి సమస్యలు మొదలైతాయి. హైపోథైరాయిడిజం హైపోథైరాయిడ్ సమస్య ఉన్నవాళ్లలో థైరాక్సిన్ లెవల్స్ తక్కువ ఉంటాయి. దాంతో థైరాయిడ్ గ్లాండ్ పనితీరు తగ్గుతుంది. ఇదొక ఆటో ఇమ్యూన్ కండీషన్ (అంటే ఇమ్యూనిటీ వ్యవస్థ మన శరీర భాగాల్ని కొత్తవాటిగా పొరబడడం వల్ల ఈ సమస్య వస్తుంది.) అలసట, బరువు పెరగడం, మోషన్ ఫ్రీగా లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ సమస్య ఆడవాళ్లు, పెద్దవాళ్లలో ఎక్కువగా కనిపిస్తుంది. మొదట్లో ఫుడ్లో అయోడిన్ లోపం వల్ల హైపోథైరాయిడిజం ఎక్కువ వచ్చేది. కానీ, ఇప్పుడు అయోడిన్ ఉన్నఫుడ్ తింటున్నారంతా. థైరాయిడ్ సమస్య ఉన్న ప్రతి పది మందిలో ఒకరు హైపోథైరాయిడిజంతో బాధపడేవాళ్లే. 

హైపర్ థైరాయిడిజం... 

థైరాక్సిన్ హార్మోన్ ఎక్కువ విడుదలవడం వల్ల హైపర్ థైరాయిడం సమస్య వస్తుంది. దాంతో మెటబాలిజం వేగంగా జరుగుతుంది. బరువు తగ్గిపోవడం, చెమటలు పట్టడం, భయాందోళనకు గురవడం ఈ సమస్య లక్షణాలు.

గాయిటర్..

కొందరిలో మెడ వాచిపోతుంది. దీన్నిగాయిటర్ అంటారు. హైపో, హైపర్ థైరాయిడిజం సమస్య ఉన్నవాళ్లకి 'గాయిటర్ ' రావొచ్చు. కొన్నిసార్లు ఈ రెండు సమస్యలు లేకున్నాకూడా గాయిటర్ సమస్య వచ్చే ఛాన్స్ ఉంది. 

నాడ్యూల్..

థైరాయిడ్ గ్రంథి మీద ఏదో ఒక చోట ఏర్పడే చిన్న గడ్డనే నాడ్యూల్ అంటారు. అయితే, ఈ గడ్డ క్యాన్సర్ గడ్డ అవునా? కాదా? అనేది తెలుసుకునేందుకు అల్ట్రాస్కానింగ్ చేయాలి. ఈ గడ్డల్ ని సర్జరీ చేసి తొలగిస్తారు. 

డయాగ్నసిస్..

థైరాక్సిన్ సమస్య ఉంటే బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి. T3, T4, TSH టెస్ట్ల ద్వారా థైరాక్సిన్ సమస్యని నిర్ధారించు కోవచ్చు.