కీలకమైన జీవోలు మాయం: దాస్తున్న సర్కారు

కీలకమైన జీవోలు మాయం: దాస్తున్న సర్కారు

    ప్రజలకు అందుబాటులో కొన్నే 

    కీలకమైనవి దాస్తున్న సర్కారు

    2017 నుంచి వందలాది జీవోల్లేవు

    మొన్నటి మున్సిపల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జీవో.. నిన్నటి ‘కమిటీ’ల ఆర్డర్లూ అంతే

    ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జీజీ ద్వారా వెలుగులోకి

ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన గవర్నమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (జీవో)లు కనబడతలేవు. రాష్ట్ర ప్రభుత్వం నిత్యం ఎన్నో జీవోలు విడుదల చేస్తున్నా కొన్నే పబ్లిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డొమైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉంచుతున్నారు. కాన్ఫిడెన్షియల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేరుతో చాలా జీవోలను సర్కారీ వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పెట్టడం లేదు. కొన్నింటిని పెట్టినా ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కావడం లేదు. సమాచార చట్టం ద్వారా ఫోరమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గవర్నెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వివరాలు సేకరిస్తే ఈ విషయాలన్నీ బయటపడ్డాయి.

కీలక జీవోలు మాయం

సాధారణంగా ప్రభుత్వ జీవోలను www.goir.telangana.gov.in  వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పెడతారు. రాష్ట్రం ఏర్పడ్డాక 2016 వరకు జీవోలను ప్రభుత్వం సైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పెట్టింది. 2017 నుంచి మాత్రం చాలా వరకు అందుబాటులో లేవు. ముఖ్యంగా నీటిపారుదల ప్రాజెక్టుల టెండర్లు, రోడ్లు భవనాల శాఖలో జాతీయ, రాష్ట్ర రహదారుల అభివృద్ధి, రెవెన్యూ శాఖ జీవోలు కనబడటం లేదు. వీటిల్లోనే టెండర్లు దాఖలు, అంచనా వ్యయం పెంపు, ఎవరికి టెండరిచ్చారు, ఎంత కోట్ చేశారు లాంటి వివరాలుంటాయి. ఇటీవల మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల విషయమై అసెంబ్లీ ఆమోదించిన చట్టం వివరాలు, ఆర్డినెన్సులూ సైట్ లేవు. టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ కార్యాలయాల కోసం రూ.100 కు గజం చొప్పున ఎకరం భూమిని 24 జిల్లాల్లో కేటాయించిన జీవో నంబర్ 66ను కూడా పెట్టలేదు. ఇటీవలి ఇంటర్ ఫలితాల అవకతవకలు, ఫీజుల నియంత్రణపై ఏర్పాటు చేసిన కమిటీల జీవోలూ సైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లేవు. అన్ని శాఖల జీవోలపై ఆర్టీఐ ద్వారా సమాచారం కోరితే 5 శాఖలే సమాధానమిచ్చినట్లు ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జీజీ కార్యదర్శి పద్మనాభరెడ్డి తెలిపారు.

సైట్లో ప్రాధాన్యం లేని జీవోలే ఎక్కువ

జీవో సైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చాలా వరకు ప్రాధ్యానం లేని జీవోలే కనబడుతున్నాయి. ఉద్యోగులు, ఐఏఎస్, ఐపీఎస్, ఉన్నతాధికారుల సెలవుల మంజూరు, ప్రమోషన్లు, ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫర్లు, వాహనాల కిరాయి, కొనుగోలు, సెల్ ఫోన్ , మెడికల్ బిల్లులు, పెట్రోలు, డీజిల్ బిల్లుల చెల్లింపు జీవోలే కనబడుతున్నాయి. జీవోలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని హైకోర్టు తీర్పిచ్చినా ప్రభుత్వం బేఖాతరు చేస్తోందని పద్మనాభరెడ్డి అన్నారు.

పనికిరాని జీవోలే ఉన్నయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

ప్రభుత్వ పనుల పారదర్శకత, జవాబుదారీకి జీవోలే నిదర్శనం. వాటిని ప్రజలకు అందుబాటులో ఉంచాలి. అవి కనబడకపోతే అవినీతి జరుగుతోందని ప్రభుత్వం పరోక్షంగా అంగీకరిస్తున్నట్లు లెక్క. 2017 నుంచి వందలాది జీవోలు సైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లేవు. ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించాం. అన్ని శాఖలకు లేఖ రాశాం. నాలుగైదు శాఖలే జవాబిచ్చాయి. కీలకమైన జీవోలు పెట్టకుండా పనికిరానివి అందుబాటులో ఉంచుతున్నారు.

– పద్మనాభరెడ్డి, ఫోరమ్‌ ఫర్ గుడ్ ..  గవర్నెన్స్ కార్యదర్శి