లక్నవరం డ్రోన్ దృశ్యాలు చూడాల్సిందే..

లక్నవరం డ్రోన్ దృశ్యాలు చూడాల్సిందే..

ప్రకృతి అందాలకు నెలవు.. లక్నవరం చెరువు.  పచ్చని చెట్లు..ఎత్తైన కొండలు..మధ్యలో సరస్సు.  సరస్సు మధ్యలో వేలాడే వంతెనలు. ఈ ప్రకృతి అందాన్ని  తిలకిస్తూ పరవశించాల్సిందే. అందాలను అస్వాదిస్తూ.. లక్నవరం చెరువులో బోటింగ్ చేయాల్సిందే. 

లక్నవరం అందాలు..
సహజ సిద్ద అందాల లక్నవరం..పర్యాటకులకు స్వర్గధామం. ఎండాకాలంలో నీటి మట్టం తగ్గిపోయిన లక్నవరం చెరువు..మళ్లీ జలశోభతో ఆకట్టుకుంటోంది. చెరువు పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకుని పర్యాటకులను ఆకర్షిస్తోంది. లక్నవరం అందాలకు సంబంధించిన  దృశ్యాలు అబ్బురపరుస్తున్నాయి. ములుగు జిల్లాలో ఉన్న లక్నవరం సరస్సు అందాలను మాటల్లో వర్ణించలేం..

లక్నవరం ఎలా వెళ్లాలి..?
లక్నవరం  ములుగు జిల్లా  గోవిందరావుపేట మండలం బుస్సాపురం సమీపంలోని కొండల మధ్య  ఉంది. ములుగు జిల్లా నుండి లక్నవరం సరస్సు కు  24 కిలో మీటర్లు.  వరంగల్ నుండి 80 కిలోమీటర్ల దూరంలో ఉంది.  వరంగల్ కు దాదాపు అన్ని  ప్రధాన పట్టణాల నుండి బస్,  రైలు సౌకర్యం ఉంది.  ఆర్టీసీ బస్సులు,  సొంత వాహనాల్లో వచ్చేవారు.. ములుగు డివిజన్ కేంద్రం దాటిన తరువాత గోవిందరావు పేట మండలంలోని చల్వాయి గ్రామం వద్దగల బుస్సాపూర్ క్రాస్ నుంచి కుడిచేతి వైపుకు 8 కిలోమీటర్ల దూరం ప్రయాణించి లక్నవరం చేరుకోవచ్చు.