
కోల్‌బెల్ట్, వెలుగు: జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలను కల్పిస్తున్నట్లు మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. శనివారం మందమర్రి మండల కేంద్రంలోని పీహెచ్‌సీని సందర్శించి వార్డులు, మందుల నిల్వ, రిజిస్టర్లను తనిఖీ చేశారు. వర్షాకాలం అంటువ్యాధుల వ్యాప్తిని నివారించేందుకు పాటించాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు.
వైద్యులు,సిబ్బంది సమయపాలన పాటిస్తూ సేవలు అందించాలన్నారు. అనంతరం తహసీల్దార్ఆఫీస్, భూసమస్యల దరఖాస్తులను పరిశీలించారు. కేజీబీవీ, ఆదర్శ స్కూళ్లలోని కిచెన్, టాయిలెట్స్, క్లాస్‌రూమ్స్, స్టూడెంట్ల అటెండెన్స్ తీరును తనిఖీ చేశారు. విద్యారంగాన్ని బలోపేతం చేస్తూ అన్ని స్కూళ్లలో స్టూడెంట్లకు సౌలత్లు కల్పిస్తున్నామన్నారు.