ఇమ్రాన్‌పై టెర్రరిస్టులు ఎదురు తిరుగుతారా?

ఇమ్రాన్‌పై టెర్రరిస్టులు ఎదురు తిరుగుతారా?
  • కాశ్మీర్​పై సరిగ్గా వ్యవహరించట్లేదని కోపం? 
  • ఆ భయంతోనే పిచ్చిపట్టినట్లువ్యవహరిస్తోన్న పాక్ ప్రధాని
  • అందుకే అణుయుద్ధం, ప్రపంచనాశనం అంటూ బెదిరింపులు

న్యూఢిల్లీ‘జెంటిల్మెన్​ గేమ్’క్రికెట్​లో లెజెండైన ఇమ్రాన్​ ఖాన్.. పాకిస్తాన్​ను మోడ్రన్​గా మార్చేస్తానంటూ సరిగ్గా ఏడాది కిందట ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. మొదటి ప్రసంగంలోనే.. ఇండియాతో ఫ్రెండ్షిప్ చేస్తానని, జమ్మూకాశ్మీర్​ ఇష్యూ పరిష్కారానికి ఒకటికి రెండడుగులు ముందుంటానని చెప్పారు. ఆయన స్పీచ్​కు అభినందనలు వెల్లువెత్తాయి.  గాడితప్పిన ఆర్థిక వ్యవస్థను దారిలోకి తెచ్చేందుకు ఖాన్​ పడిన కుస్తీ చూసి.. పాక్​కు అచ్ఛేదిన్​ రాబోతున్నాయని చాలా మంది భావించారు. ఇప్పుడు ఇమ్రాన్​ ‘మోడ్రనైజేషన్’ నినాదం అటకెక్కింది. పాక్​ సిస్టమ్​లో తానొక టూల్​ మాత్రమేనని, దాన్ని మాత్రమే ఫాలో కావాలన్న వాస్తవాన్ని ఏడాదిలోపే గుర్తించారు. అధికార పార్టీలు మారినా పాకిస్తాన్‌ స్టయిల్‌ మారదు. కాశ్మీర్‌ అనేది అప్పుడు, ఇప్పుడు వాళ్లకి ఒక ఆయుధమే. కంచెకు ఇవతల టెర్రరిజాన్ని, సెపరేటిజాన్ని సజీవంగా ఉంచడంలో దాయాది దేశం గత 70 ఏండ్లుగా సక్సెస్​ అవుతూనే వచ్చింది. ఇప్పటివరకు పాక్​ ఎత్తుగడల్ని తిప్పికొడుతూ వచ్చిన ఇండియా.. తొలిసారి ‘ఎదురు దాడి​’లోకి మారింది. కాశ్మీర్​కు స్పెషల్​ స్టేటస్​ కల్పించే ఆర్టికల్​ 370ని రద్దుచేయడం ద్వారా కేంద్రం పాక్​కు భారీ షాకిచ్చింది.

సెక్యూరిటీ స్ట్రాటజీ పరంగా కాశ్మీర్​ను బఫర్​జోన్​గా పాక్​ భావిస్తుంది. జమ్మూకాశ్మీర్​కు స్పెషల్​ స్టేటస్ ఉండటంతో కంచెకు రెండు వైపులా అది ఒకేరకమైన కార్యకలాపాల్ని సాగించింది. పాక్​ ఆక్రమిత కాశ్మీర్​(పీవోకే) కేంద్రంగా పనిచేస్తూ.. కాశ్మీర్‌​లో నివసించే అన్ని వర్గాల ప్రజల జీవితాల్లోకీ చొరబడగలిగింది. ఆర్టికల్​ 370 రద్దు, రాష్ట్ర విభజన తర్వాత ప్రాంతం మొత్తం కేంద్రం నియంత్రణలోకి రావడంతో సమాచారం నేరుగా ఢిల్లీకి చేరుతుంది. తద్వారా పీవోకే సహా గిల్జిత్‌‌‌‌–-బల్టిస్తాన్‌‌‌‌​లో పాక్​ కార్యకలాపాలను నియంత్రించే సెక్యూరిటీ ఫోర్సెస్​ మధ్య సమన్వయం మరింత పెరుగుతుంది. కాశ్మీర్​ తన లోకల్​ ప్రత్యేకత కోల్పోవడంతో.. ఇండియా బలగాలు పీవోకేలో కొనసాగుతున్న అతిపెద్ద ప్రాజెక్టు ‘చైనా–పాకిస్తాన్​ ఎకనామిక్​ కారిడార్​(సీపెక్​)కు ఇంకా దగ్గరగా వెళ్లినట్లైంది. 1947 నుంచీ పీవోకేపై నియంత్రణ, కంచె ఇవతలి కాశ్మీర్​పై తీవ్రప్రభావం చూపుతున్న పాక్​.. మొత్తం రీజియన్​ను అభివృద్ధి చెందనీయలేదు. కాబట్టే ప్రజలమధ్య కమ్యూనికేషన్​ అంతగా పెరగలేదు. కాశ్మీర్​ కాకుండా పాక్​తో బోర్డర్​ పంచుకునే పంజాబ్​, రాజస్థాన్​, గుజరాత్ రాష్ట్రాలకు ఏనాడూ స్పెషల్​ స్టేటస్ దక్కిందిలేదు. 1980ల్లో అతి కొద్దికాలం తప్ప ఈ మూడు రాష్ట్రాల్లో పాక్​ విషబీజాల్ని నాటలేకపోయింది. దశాబ్దాలుగా కాశ్మీర్​పై ప్రయోగాలు చేస్తోన్న పాక్​.. 1989 తర్వాత 30 ఏండ్లపాటు కల్లోలాన్ని కొనసాగించడంలో విజయవంతమైంది.ఆర్టికల్​370 రద్దుతో ఇండియాలోకి జమ్మూకాశ్మీర్​ విలీనం పూర్తి కావడంతో ఇక పాక్​ ఎత్తు ఇక్కడ పారదు. ఇన్నాళ్లూ ‘ఫస్ట్​ లైన్​ ఆఫ్​ డిఫెన్స్​గా భావించిన కాశ్మీర్​ను కోల్పోవడంతో ఇమ్రాన్​కు పిచ్చిపట్టినంతపనైంది. ఆ ఉద్వేగంలోనే కాశ్మీర్​ కోసం ఎక్కడిదాకానైనా వెళతానని, ప్రపంచ దేశాలు సపోర్ట్​ చేయకున్నా పోరాడుతానని, అవసరమైతే అణుయుద్ధానికి కూడా రెడీగా ఉన్నామంటూ ప్రకటనలు చేశారు. కాశ్మీర్​కు స్పెషల్​ స్టేటస్​ ఎత్తేసిన తర్వాత 25 రోజుల వ్యవధిలో ఆటం బాంబులు వేస్తానంటూ 3 సార్లు వార్నింగ్​ ఇచ్చారాయన.

గిల్జిత్‌‌‌‌-బల్టిస్తాన్‌‌‌‌ మధ్య కొత్త సెజ్‌‌

చైనా – పాకిస్తాన్‌‌‌‌ ఇప్పుడు మరో కొత్త ఎకనామిక్‌‌‌‌ కారిడార్‌‌‌‌ (సెజ్‌‌‌‌)‌‌‌‌ను ప్రారంభించాయి. పాకిస్తాన్‌‌‌‌ ఆధీనంలో ని కాశ్మీర్‌‌‌‌‌‌‌‌లో గిల్జిత్‌‌‌‌ – బల్టిస్తాన్‌‌‌‌ మధ్య మక్పోన్‌‌‌‌దాస్‌‌‌‌ ‌‌‌‌సెజ్‌‌‌‌ను నిర్మిస్తున్నాయి.  చకచకా పనులు జరుగుతున్న  శాటిలైట్‌‌‌‌ చిత్రాలు బయటకు వచ్చాయి. కాశ్మీర్‌‌‌‌‌‌‌‌ ప్రాంతంలోకి చైనా వచ్చేందుకు పాకిస్తాన్‌‌‌‌ చాలా కాలం నుంచి ఆ దేశానికి సాయపడుతూనే ఉంది. 1963లో సియాచిన్‌‌‌‌కు ఉత్తరాన ఉన్న షాక్స్గామ్‌‌‌‌ లోయలోని భూములను చైనాకు ఇచ్చింది. డ్రాగన్‌‌‌‌ కంట్రీ 2017లో అక్కడ సైనిక పోస్టులు, రోడ్లు నిర్మించుకుంది. పాకిస్తాన్‌‌‌‌ బోర్డ్‌‌‌‌ ఆఫ్ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ 2019లో 9 సెజ్‌‌‌‌లను డవలప్‌‌‌‌ చేసేందుకు నిధులు విడుదల చేయగా.. వాటిలో మక్పోన్‌‌‌‌దాస్‌‌‌‌ ఒకటి. గిల్జిత్‌‌‌‌ సిటీకి 40 కిలోమీటర్ల దూరంలో దీన్ని నిర్మిస్తున్నారు. పాకిస్తాన్‌‌‌‌ ప్రధాని ఇమ్రాన్‌‌‌‌ ఖాన్‌‌‌‌ చైనా పర్యటనకు వెళ్లిన టైంలో దీనికి సంబంధించి అగ్రిమెంట్‌‌‌‌ జరిగినట్లు తెలుస్తోంది. దీని కోసం చైనా దాదాపు 750 ఎకరాలు ఉపయోగించుకుంటుండగా.. పాకిస్తాన్‌‌‌‌ సీపీఈసీ వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లో మాత్రం కేవలం 250 ఎకరాలు మాత్రమే చైనాకు కేటాయించినట్లు ఉంది. పాకిస్తాన్‌‌‌‌ స్టాఫ్‌‌‌‌ కోసం ప్రత్యేకమైన బ్యారక్లు నిర్మించారు. అంతే కాకుండా వాళ్లంతా ప్రార్థనలు
చేసుకునేలా మసీదును నిర్మించినట్లు శాటిలైట్‌‌‌‌ ఫొటోల్లో తేలింది.

ఆందోళనలో ఇమ్రాన్ఖాన్

కాశ్మీర్​లోయలోకి పాక్ సర్కారు ఎగుమతి చేసిన, చేస్తున్న టెర్రరిస్టుల్ని ఇండియా సక్సెస్​ఫుల్​గా అడ్డుకుంటే గనుక తమ బేస్​ను పూర్తిగా కోల్పోవాల్సి వస్తుందని ఇమ్రాన్​ ఖాన్ ఆందోళన చెందుతున్నారు. పీవోకేలో పాక్ ఆర్మీ, ఐఎస్​ఐ ఆధ్వర్యంలో వందలాది టెర్రరిస్టులకు ట్రైనింగ్​ ఇచ్చే ప్రక్రియ దశాబ్దాలుగా కొనసాగుతోంది. స్పెషల్​ స్టేటస్​ రద్దుకుతోడు ఎల్​వోసీ వద్ద ఇండియా పట్టు పెరిగేకొద్దీ పాక్​లో పరిస్థితులు అంతకంతకూ దిగజారుతాయి. ట్రైనింగ్​ పొందిన టెర్రరిస్టులు.. పాక్​ సర్కారునే ధిక్కరించే లేదా తిరుగుబాటు చేసే అవకాశాలే ఎక్కువ. అందుకే కాశ్మీర్​ సమస్యాత్మక ప్రాంతంగానే ఉండిపోవాలని, లోయలో టెర్రరిజం, సెపరేటిజం కొనసాగాలని పాక్​ కోరుకుంటుంది. ఆర్టికల్​ 370 రద్దుతో ఎల్​వోసీ, ఏవోసీ వద్ద ఇప్పటికిప్పుడు ఏదీ జరగకున్నా.. కాశ్మీర్​లోయలో పరిస్థితులు మాత్రం పూర్తిగా మారిపోతాయి. దీంతో పాక్​ తన వ్యూహాత్మక టెరిటరీని కోల్పోతుంది. టోటల్​గా ఇమ్రాన్​ మనుగడ, పాక్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే అవకాశాలున్నాయి. కాశ్మీర్​ విషయంలో ఒక్క చైనా తప్ప మిగతా దేశాలేవీ సపోర్టు ఇవ్వకపోవడంతో ఇమ్రాన్​లో భయం మరింత పెరిగింది. కాబట్టే ఖాన్​ కారాలుమిరియాలు నూరడం మానేసి ఆటం బాంబులేస్తానని పదే పదే బెదిరిస్తున్నాడు.