సబ్​స్క్రయిబర్లను పోగొట్టుకుంటున్న టెలికం కంపెనీలు

సబ్​స్క్రయిబర్లను పోగొట్టుకుంటున్న టెలికం కంపెనీలు

న్యూఢిల్లీ: ఈ ఏడాది ఏప్రిల్​ నెలలో 70 లక్షల మంది యాక్టివ్​ సబ్​స్క్రయిబర్లను టెల్కోలు పోగొట్టుకున్నాయి. గత పది నెలల్లో చూస్తే ఇంత మంది కస్టమర్లను పోగొట్టుకోవడం ఇదే మొదటిసారి. చాలా మంది యూజర్లు రెండో సిమ్​ను వాడకపోవడం వల్లే ఇలా జరిగిందని ఎనలిస్టులు చెబుతున్నారు. భారతి ఎయిర్​టెల్​, రిలయన్స్​ జియో, వోడాఫోన్​ ఐడియా (వీ)  కంపెనీలు  మూడూ ఏప్రిల్​ నెలలో సబ్​స్క్రయిబర్లను పోగొట్టుకోవడం విశేషం. ఒక్క ఏప్రిల్​ 2020లో లాక్​డౌన్​ టైమును మినహాయిస్తే, గత పదేళ్లలో టెలికం కంపెనీలు ఇంత పెద్ద సంఖ్యలో కస్టమర్లను పోగొట్టుకోవడం ఇది రెండోసారి మాత్రమే. టారిఫ్​లు పెరుగుతున్న నేపథ్యంలో సిమ్​ కన్సాలిడేషన్​కు కస్టమర్లు మొగ్గుచూపుతున్నట్లు ​ జెఫ్రీస్ పేర్కొంది. జియో లక్ష మంది కస్టమర్లను కోల్పోగా, ఎయిర్​టెల్​ 31 లక్షల మంది, వీ 38 లక్షల మంది కస్టమర్లను నష్టపోయాయి.