వడ్ల కొనుగోలులో.. ఈ సెంటర్లు ఆదర్శం

వడ్ల కొనుగోలులో.. ఈ సెంటర్లు ఆదర్శం
  • వడ్ల కొనుగోళ్లలో హాజీపూర్, పడ్తనపల్లి సెంటర్లు ఆదర్శం
  • అందుబాటులోకి 16 ప్యాడీ క్లీనింగ్ మెషిన్లు
  • వడ్లు క్లీన్ చేయంగనే కాంటా పెడుతున్రు
  • ఆనందం వ్యక్తం చేస్తున్న రైతులు

మంచిర్యాల,వెలుగు: అక్కడ తూకంలో మోసం లేదు, బస్తాకు రెండు మూడు కిలోలు కటింగ్​లేదు, తాలు.. తప్ప.. మట్టి పేరుతో దోపిడీ లేదు. సంచికి సంచి,  ఆపై దోసెడు మొగ్గు.. బస్​అంతే. వడ్ల కొనుగోళ్లలో హాజీపూర్, పడ్తన్​పల్లి పీఏసీఎస్​సెంటర్లు ఆదర్శంగా నిలుస్తున్నాయి. కటింగ్, కమీషన్లు అంటూ రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు సాఫీగా సాగుతున్నాయి. మాయిశ్చర్​ రాగానే కాంటా వేసి వెంటనే మిల్లులకు తరలిస్తుండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 
అందుబాటులో ప్యాడీ క్లీనింగ్​మెషిన్లు
పడ్తనపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం(పీఏసీఎస్​) ఆధ్వర్యంలో హాజీపూర్, పడ్తనపల్లిలో కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేశారు. సొసైటీ​చైర్మన్​మల్రాజు 
రామారావు చొరవతో కొనుగోళ్లు సక్సెస్​ఫుల్​గా సాగుతున్నాయి. సొసైటీ ఆధ్వర్యంలో 16 ప్యాడీ క్లీనింగ్​ మెషిన్లను కొనుగోలు చేసి సెంటర్లలో అందుబాటులో ఉంచారు. రైతులు17 శాతం తేమ వచ్చేదాకా వడ్లను ఆరబెట్టి, మిషన్ల ద్వారా శుభ్రం చేయాలనే రూల్​పెట్టారు. తాలు తప్ప తొలగించిన తర్వాత సంచి బరువుకు సంచి వేసి, దోసెడు మొగ్గుతో కాంటా వేస్తున్నారు. వెంటనే లారీలు తెప్పించి మిల్లులకు తరలిస్తున్నారు. దీంతో రైతులకు ఎదురుచూపులు తప్పుతున్నాయి. హమాలీ చార్జీలు ఇతర సెంటర్లలో క్వింటాలుకు రూ.50 వసూలు చేస్తుంటే.. ఇక్కడ రూ.40 మాత్రమే తీసుకుంటున్నారు. ఇప్పటికే పడ్తనపల్లిలో కొనుగోళ్లు పూర్తి చేసి 60 లారీల వడ్లను మిల్లులకు తరలించారు. హాజీపూర్​లో తుది దశకు చేరుకోగా, సంచులు లేకపోవడంతో ఆలస్యమవుతోంది. 30 లారీల వడ్లను మిల్లులకు తరలించామని, మరో 25 లారీలు ఉన్నాయని రామారావు తెలిపారు. 
అన్నిచోట్లా ఇలానే చేస్తే..
హాజీపూర్, పడ్తనపల్లిలో మాదిరిగా మిగతా సెంటర్లలోనూ వడ్లు కొనుగోళ్లు చేస్తే తమకు ఎంతో మేలు జరుగుతుందని రైతులు అంటున్నారు. అయితే చాలా సెంటర్లలో రైతులను దోచుకోవాలన్న ధోరణి మాత్రమే కనిపిస్తోంది. ప్రభుత్వం ప్యాడీ క్లీనింగ్​మెషిన్లను ఇచ్చినప్పటికీ వాటిని పక్కనపెట్టారు. తాలు తప్ప మట్టిపెళ్లలను సాకుగా చూపుతూ 40 కిలోల బస్తాకు రెండు మూడు కిలోలు అదనంగా తూకం వేస్తున్నారు. ఇట్ల క్వింటాలుకు నాలుగైదు కిలోలు దండుకోవడం కామన్​అయ్యింది. పలుచోట్ల రైతులు ఆందోళనకు దిగినప్పటికీ ఆఫీసర్లు పట్టించు248 సెంటర్లను ఏర్పాటు చేశారు. 1.76 లక్షల టన్నులు టార్గెట్ కాగా, 1.20 లక్షల టన్నులలోపే సెంటర్లకు రావచ్చని అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు 65 వేల టన్నులు కాంటా వేశారు. ఇంకా 50 నుంచి 60 వేల టన్నుల వడ్లు సెంటర్లలో ఉన్నాయి. ఇప్పటికైనా ఆఫీసర్లు మేల్కొని హాజీపూర్, పడ్తనపల్లి సెంటర్ల మోడల్ అమలు చేస్తే రైతులకు లాభం జరుగుతుంది.

రైతులకు మేలు జరగాలనే

రైతులకు మేలు జరగాలన్న ఉద్దేశంతో కొన్ని రూల్స్ పాటిస్తున్నాం. మాయిశ్చర్ వచ్చాక వడ్లను శుభ్రం చేయడానికి ప్యాడీ క్లీనింగ్ మెషిన్లు ఏర్పాటు చేశాం. తాలు తప్ప తొలగించి కాంటా వేస్తున్నాం. సంచికి సంచి, దోసెడు (పావు కిలో) మొగ్గు జోకుతున్నం. హమాలీ చార్జి బయట రూ.50 ఉంటే మేం రూ.40 మాత్రమే తీసుకుంటున్నాం. సంచులు లేక కొంత ఆలస్యమవుతోంది. -మాల్రాజు రంగారావు, పడ్తనపల్లి పీఏసీఎస్ ఛైర్మన్
కటింగ్ లేదు.. కమీషన్ లేదు
నేను పదెకరాల్లో పని పండించిన. పొలం కోసిన తర్వాత వడ్లు తీసుకొచ్చి ఆరబోసిన. మాయిశ్చర్ రాంగనే మిషన్ తో క్లీన చేసిన. వడ్లు సక్కగ చేయించిన తర్వాత కాంటా పెడుతున్నరు. సంచికి సంచి వేస్తున్నరు, కటింగ్ లేదు. కమీషన్ లేదు. చుట్టుపక్కల సెంటర్లల్ల బస్తాకు రెండు కిలోలు కటింగ్ పెడుతున్రట. మా దగ్గర అటువంటిదేం లేదు. -తిప్పని కుమార్, టీకనపల్లి రైతు