ఆర్టీసీపై ఇన్ చార్జ్ ఎండీకి అవగాహలేదు

ఆర్టీసీపై ఇన్ చార్జ్ ఎండీకి అవగాహలేదు

ఆర్టీసీ గురించి దాని ఇంచార్జీ ఎండీ సునీల్ శర్మకు ఏం తెలుసనీ ప్రశ్నించారు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వథామ రెడ్డి. ఎండీ సునీల్ శర్మ హై కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన విషయంపై  మీడియాతో మాట్లాడారు. కోర్టు చీవాట్లు పెట్టినా ప్రభుత్వం, యాజమాన్యం మారడంలేదన్నారు. సునీల్ శర్మ బాధ్యతలు చేపట్టి 17 నెలలే అయిందని, కనీసం 10 సార్లు కూడా ఆయన బస్సు భవన్ కు రాలేదన్నారు. ఆర్టీసీలో సమస్యలు లేవని, ఆర్టీసీ ఆర్థికంగా వెనుకబడి ఉందని, సమ్మెను ఇల్లిగల్ అని ప్రకటించాలని కోర్టుకు చెప్పడాన్ని చూస్తే ఆర్టీసీ పై ఎండీకి అవగాహన లేదని తెలుస్తోందన్నారు. అంతేకాదు కేవలం ప్రభుత్వం రాసిస్తున్న అఫిడవిట్ పై ఎండీ సంతకం చేసి కోర్టుకు సబ్మిట్ చేస్తున్నారని ఆరోపించారు.

తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 6 ఏళ్ల వరకు ఎండీ లేకపోవడం దురదృష్టకమన్నారు. ఎండీని నియమించక పోవడం ఉద్దేశపూర్వకంగానే ఆర్టీసీని పనికి రాకుండా చేసి నిర్ములించే పథకం లో భాగంగమన్నారు. ఆర్టీసీ ఆస్థులను అమ్మే విధంగా వారి కుటుంబ సభ్యులకు, బంధువులకు, అనునాయులకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం యత్నిస్తోందన్నారు. సమ్మెకారణంగాఆర్టీసీకి నష్టం కలగలేదని, ప్రభుత్వ విధానాల కారణంగా నష్టపోయిందని అన్నారు. సమ్మె చట్టబద్ధమా ? చట్ట విరుద్ధమా ? అనేది కోర్టు తేలుస్తుందని అన్నారు.

ఆర్టీసీ ఆస్థులను, ప్రజా రవాణాను కాపాడుకోవడానికి సమ్మె చేస్తున్నామన్న అశ్వత్ధామరెడ్డి… సమస్యలు పరిష్కరం అయ్యేవరకు సమ్మె కొనసాగిస్తానన్నారు. ప్రజలంతా మద్దతు తెలపాలని కోరారు.