ఏం కొడుకుల్లా మీరు.. తండ్రి మృతదేహం ముందే.. ఆస్తి కోసం గొడవ ..అంత్యక్రియలకూ హాజరుకాని కొడుకులు

ఏం కొడుకుల్లా మీరు.. తండ్రి మృతదేహం ముందే.. ఆస్తి కోసం గొడవ ..అంత్యక్రియలకూ హాజరుకాని కొడుకులు

సిద్దిపేట రూరల్, వెలుగు : ఆస్తి కోసం గొడవ పడిన కొడుకులు.. తండ్రి అంత్యక్రియలకూ ముందుకు రాలేదు. చివరకు మృతుడి భార్యే తలకొరివి పెట్టి అంత్యక్రియలు పూర్తి చేసింది. ఈ ఘటన సిద్దిపేట రూరల్‌‌‌‌ మండలం పుల్లూరులో బుధవారం జరిగింది. గ్రామానికి చెందిన గొడుగు పోచయ్య(67)కు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. పోచయ్యకు 20 గుంటల పొలం ఉండడంతో పంపకం విషయంలో గొడవలు జరుగుతున్నాయి. అనారోగ్యంతో బాధపడుతున్న పోచయ్య మంగళవారం రాత్రి చనిపోయాడు. 

బుధవారం అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా... పొలం విషయంలో ముగ్గురి మధ్య గొడవ జరిగింది. దీంతో కుమార్తె తండ్రి పోచయ్య డెడ్‌‌‌‌బాడీని బస్టాండ్‌‌‌‌లోకి తీసుకెళ్లగా గ్రామస్తుల సూచనతో  రైతు వేదికలోకి తరలించారు. కొడుకులతో గ్రామస్తులు మాట్లాడినా వారు అంత్యక్రియలు చేసేందుకు ఒప్పుకోలేదు. చివరకు మృతుడి భార్య యాదవ్వనే తలకొరివి పెట్టి అంత్యక్రియలు పూర్తి చేసింది.