
మెహిదీపట్నం, వెలుగు: గోల్కొండలో బోనాలు ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. జగదాంబికా మహంకాళి అమ్మవారికి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో గురువారం ఏడో పూజ నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ మహేశ్వర్, ఈవో శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో అమ్మవారికి శాకాంబరీ అలంకరణతో ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు భారీగా తరలివచ్చి బోనాలను సమర్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.