గ్రేటర్‌‌లో సగం మంది కూడా ఓట్లేస్తలే

గ్రేటర్‌‌లో సగం మంది కూడా ఓట్లేస్తలే
  • బస్తీల్లో నే ఎక్కువ శాతం ఓటింగ్‌‌ నమోదు
  • గేటెడ్‌ కమ్యూనిటీలు,అపార్ట్‌‌మెంట్‌‌వాసుల అనాసక్తి

హైదరాబాద్‌‌, వెలుగుగ్రేటర్ హైదరాబాద్‌‌మున్సిపల్‌‌ఎన్నికల్లో సగం మంది కూడా ఓట్లేస్తలేరు. గత రెండు ఎన్నికల్లో పోలింగ్ 50 శాతం మించలేదు. 2009లో 42.92 శాతం, 2016లో 45.27 శాతం మాత్రమే రికార్డయింది. పెద్దపెద్ద అపార్ట్‌‌మెంట్లు, గేటెడ్‌‌కమ్యూనిటీల్లో ఉండేటోళ్లు ఓటు వేసేందుకు పెద్దగా ఆసక్తి చూపకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. అయితే బస్తీల్లో మాత్రం పోలింగ్ శాతం ఎక్కువగా నమోదవుతోంది.

2009 నుంచీ అంతే

2009లో జీహెచ్‌‌ఎంసీ ఏర్పాటైంది. అప్పటి వరకు ఎంసీహెచ్‌‌(మున్సిపల్‌‌కార్పొరేషన్‌‌ఆఫ్‌‌హైదరాబాద్‌‌)గా ఉండేది. ఎంసీహెచ్‌‌గా ఉన్నప్పటి నుంచే హైదరాబాద్‌‌లో ఓటింగ్‌‌శాతం అంతంత మాత్రమే నమోవుతోంది. 2009లో 42.92 శాతం రికార్డయ్యింది.  విజయనగర్‌‌కాలనీ లో అతి తక్కువగా -27.15 శాతం పోలింగ్‌‌నమోదైంది. ఇక 2016 ఎన్నికల్లో అత్యధికంగా రాజేంద్రనగర్​లో 67.40 శాతం ఓటింగ్ రికార్డయింది. ఈసారి కూడా అత్యల్పంగా విజయనగర్‌‌కాలనీలో 33.98 శాతం పోలింగ్‌‌నమోదైంది. మొత్తంగా 2009 ఎన్నికలతో పోలిస్తే 2016లో 2.35 శాతం పోలింగ్‌‌పెరగడం గమనార్హం.

వెస్ట్‌‌, ఈస్ట్‌‌జోన్లు బెటర్‌‌

2016లో సౌత్ జోన్‌‌లోని ఏడు నియోజకవర్గాల పరిధిలోని దాదాపు 53 వార్డుల్లో నమోదైన ఓట్లు 45 శాతం లోపే. పోలింగ్‌‌విషయంలో శివార్లలోని వెస్ట్‌‌, ఈస్ట్‌‌జోన్లు కొంత ముందున్నాయి. ఈస్ట్‌‌జోన్‌‌లోని కాప్రా, ఉప్పల్‌‌, ఎల్‌‌బీనగర్‌‌సర్కిళ్ల పరిధిలోని 23 డివిజన్లలో 45 శాతం మంది పైనే ఓట్లు వేశారు. వెస్ట్‌‌జోన్‌‌లో కూడా పోలింగ్‌‌సగటు 45 శాతం వరకు ఉంది. ఐటీ కంపెనీలు, మల్టీ నేషన్‌‌కంపెనీల ఉద్యోగులకు నెలవైన ఈ ప్రాంతంలో కాలనీలు, గేటెడ్‌‌కమ్యూనిటీలతో పోలిస్తే బస్తీవాసులే పోలింగ్‌‌లో ముందున్నారు. కోర్‌‌ఏరియాలో పోలింగ్‌‌అంతంత మాత్రంగానే నమోదైంది. ఇక్కడి 8 సర్కిళ్లలోని 27 డివిజన్లలో పోలింగ్‌‌సగటు 42 శాతం మాత్రమే. అంబర్‌‌పేట, ముషీరాబాద్‌‌నియోజకవర్గాల్లోని డివిజన్లలో పోలింగ్‌‌కొంత మెరుగ్గా ఉన్నప్పటికీ జూబ్లీహిల్స్‌‌, ఖైరతాబాద్‌‌నియోజకవర్గాల్లో కొంత తగ్గింది.

పోలింగ్‌‌ఎందుకు తక్కువంటే..?

గ్రేటర్ హైదరాబాద్‌‌లో ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చే వారు ఎక్కువ. వారికి గ్రేటర్ రాజకీయాలపై ఆసక్తి లేకపోవడం, పోలింగ్ రోజున దొరికిన సెలవును ఏదో ఒక పనికి వాడుకుందామన్న ఆలోచన వంటివి ఓటింగ్ తగ్గడానికి కారణాలు. పోలింగ్ రోజున ఇచ్చే సెలవును పిక్నిక్​గా, ఏదైనా హాలిడేలా ఎంజాయ్ చేద్దామనుకోవడం కూడా పోలింగ్ తగ్గడానికి కారణమవుతోంది. ధనికులు, వ్యాపార వర్గాల వారు క్యూలో నిలబడి ఓటేయడానికి ఇష్టపడటం లేదు. మరోవైపు గ్రేటర్‌‌పరిధిలో వివిధ కారణాలతో ఇళ్లు మారేవారు.. కొత్త చోటుకు ఓటర్​ కార్డులను మార్చుకోపోవడం, పాత ప్రాంతానికి వెళ్లి ఓటేయడానికి ఇబ్బందులు వంటివి కూడా పోలింగ్ శాతంపై ప్రభావం చూపుతున్నాయి.

గ్రేటర్ లో పోలింగ్ శాతం ఇలా

2009                                  2016

మొత్తం ఓట్లు:       56,99,015                      74,23,980

పోలైన ఓట్లు:        24,08,001                      33,60543

పోలింగ్ శాతం:       42.92%                          45.27%