వచ్చేనెల 3 నుంచి టీనేజర్లకు టీకా

వచ్చేనెల 3 నుంచి టీనేజర్లకు టీకా

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో జనవరి 3 నుంచి పిల్లలకు ఫస్ట్ డోసు, జనవరి10 నుంచి హెల్త్ కేర్ వర్కర్లు, వృద్ధులకు బూస్టర్ డోస్ వ్యాక్సిన్ వేయడానికి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌‌‌‌రావు ఆదేశించారు. ప్రస్తుత వ్యాక్సినేషన్‌‌‌‌ను మరింత స్పీడప్ చేయాలని చెప్పారు. సోమవారం ఎంసీఆర్‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌ఆర్డీలో ఉన్నతాధికారులతో మంత్రి రివ్యూ నిర్వహించారు. రాష్ట్రంలో15–-18 ఏండ్ల పిల్లలు 22.78 లక్షల మంది, వృద్ధులు 41.6 లక్షల మంది, హెల్త్ కేర్, ఫ్రంట్‌‌‌‌ లైన్ వర్కర్లు 6.34 లక్షల మంది ఉన్నారని ఆఫీసర్లు మంత్రికి వివరించారు. ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలని మంత్రి సూచించారు. రాష్ట్రంలో 99.5 శాతం మందికి ఫస్ట్ డోసు, 64 శాతం మందికి సెకండ్ డోసు వ్యాక్సినేషన్ పూర్తయిందని ఆఫీసర్లు చెప్పగా, సెకండ్ డోసు కూడా వేగంగా పూర్తి చేయాలన్నారు. ఒమిక్రాన్ కేసులు, వైరస్ వ్యాప్తిపైనా మంత్రి ఆరా తీశారు. థర్డ్ వేవ్ వస్తే ఎదుర్కోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. 

నీతి ఆయోగ్ హెల్త్ ఇండెక్స్‌‌లో తెలంగాణ దేశంలోనే మూడో స్థానంలో నిలవడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. డాక్టర్లు, నర్సులు, హెల్త్ కేర్ వర్కర్ల కృషి వల్లే ఇది సాధ్యమైందన్నారు. సర్కార్ దవాఖాన్లలో సౌలతులు క‌‌ల్పిస్తూ, మంచి వైద్యం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందనడానికి ఈ ర్యాంకులే నిదర్శనమన్నారు. తమిళనాడు, కేరళను అధిగమించి టాప్‌‌లో నిలిచేందుకు కృషి చేయాలని అధికారులు, సిబ్బందిని మంత్రి కోరారు. ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని చెప్పారు.