మహబూబాబాద్ జిల్లాలో వినూత్నంగా వీఆర్ఏల నిరసన

మహబూబాబాద్ జిల్లాలో వినూత్నంగా వీఆర్ఏల నిరసన

మహబూబాబాద్ జిల్లా :  తమ డిమాండ్లు, హామీలను నెరవేర్చాలంటూ తెలంగాణ వ్యాప్తంగా వీఆర్ఏలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో వీఆర్ఏలు వినూత్నంగా నిరసన చేపట్టారు. తమకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే నెరవేర్చాలంటూ.. బతుకమ్మ ఆడారు. సీఎం కేసీఆర్, ప్రొఫెసర్ జయశంకర్ చిత్ర పటాల ముందు బతుకమ్మను పెట్టి ఆడి, పాడారు.

ఇవాళ్టితో 63 రోజులుగా నిరసనలు చేపడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీ ప్రకారం పే స్కేల్ జీఓను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.