ఆకట్టుకుంటున్న జడకొప్పులాటలు

ఆకట్టుకుంటున్న జడకొప్పులాటలు

నిజామాబాద్: జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో సాయంకాలం పూట ఆహ్లద వాతావరణం కనిపిస్తోంది. చాలా గ్రామాల్లో సాయంకాలం వేళ రైతులు, పిల్లలు, పెద్దలు అందరూ కలిసి జడకొప్పులాటలు అడుతున్నారు. హుషారుగా పాటలు పాడుతూ, జడకొప్పు చుట్టూ తిరుగుతూ, కోలాలు ఆడుతున్న తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. ఉగాది నుంచి శ్రీరామ నవమి వరకు గ్రామాల్లో  జడకొప్పులాడటం సంప్రదాయంగా వస్తోంది. ఈ కళారూపం దైవ ప్రార్థనలో ఒక భాగం అని ఇక్కడి పెద్దలు చెబుతున్నారు. పంటలు చేతికొచ్చే ఈ సమయంలో ఇలా ప్రార్థిస్తే దిగుబడి బాగా వస్తుందని   రైతుల నమ్మకం.

ఇవి కూడా చదవండి...

25వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సబ్ ఇన్స్పెక్టర్

కాలేజీ విద్యార్థినులతో స్టెప్పులేసిన కలెక్టరమ్మ