కోతికి జీవిత కాల జైలు శిక్ష

కోతికి జీవిత కాల జైలు శిక్ష

నేరం చేసిన ప్రతీ మనిషికి శిక్ష పడుతుంది అంటుంటారు న్యాయమూర్తులు. కానీ, ఉత్తరప్రదేశ్ ఫారెస్ట్ అధికారులు మాత్రం ‘మనుషులకే కాదు తప్పు చేసిన మూగ జంతువులకీ శిక్ష పడుతుంది’ అంటున్నారు. అనడమే కాదు ఒక కోతికి శిక్ష వేసి చూపించారు కూడా. కోతికి శిక్ష వేయడమేంటి. అసలు ఆ కోతి చేసిన నేరం ఏంటని ఆశ్చర్యపోతున్నారా! అయితే, ఇది చదవండి..

ఉత్తరప్రదేశ్, మీర్జాపూర్ లో ఒకతను వీధులెంబడి కాలియా అనే కోతని ఆడిస్తూ బతికేవాడు. అలా వచ్చిన డబ్బుతో రోజూ మద్యం తాగుతూ, కోతికి కూడా అలవాటు చేశాడు. అతనితో పాటు ఆ కోతి కూడా మద్యానికి బానిసైంది. కొన్నాళ్లకు అనారోగ్యంతో ఆ వ్యక్తి చనిపోయాడు. రోజూ మద్యానికి అలవాటుపడ్డ కోతి, అది లేకుండా ఉండలేకపోయింది. మద్యం కోసం మద్యం దుకాణాలపై, దారిన పోయే వ్యక్తులపై దాడి చేసేది. అలా ఇప్పటివరకు 250 మందిని గాయపరిచింది. 

ఆ కోతి బెడద తట్టుకోలేక స్థానికులు ఫారెస్ట్ అధికారులకు కంప్లెయింట్ చేశారు. అతి కష్టంమీద కోతిని బంధించి, కాన్పూర్ జూకి తరలించారు. జూలో ఉంచినా కోతి ప్రవర్తన మారలేదు. అక్కడ కూడా సైకోలా ప్రవర్తించేది. దాంతో జూ అధికారులు కాలియా కోతిని జంతు వైద్యులకు చూపించారు. కోతిని టెస్ట్ చేసిన వైద్యులు మద్యానికి బానిస కావడంవల్ల మానసికంగా ఇలా మారింది. ఈ కోతిని ఇతర జంతువులతో కలిపి ఉంచితే వాటికి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. దీన్ని జీవితకాలం వేరుగా ఉంచాలని సూచించారు. దాంతో కోతిని వేరుగా బంధించి ఉంచుతున్నారు.