ఒడిశాలో రూ. లక్ష కోట్లతో గ్రీన్​ఫీల్డ్​ స్టీల్​ ప్లాంట్​

ఒడిశాలో రూ. లక్ష కోట్లతో గ్రీన్​ఫీల్డ్​ స్టీల్​ ప్లాంట్​

న్యూఢిల్లీ: ప్రపంచంలోనే రెండో పెద్ద స్టీలు తయారీ కంపెనీ ఆర్సిలర్​ మిట్టల్​ ఒడిశాలో రూ. లక్ష కోట్లతో ఇంటిగ్రేటెడ్​ గ్రీన్​ఫీల్డ్​ స్టీల్​ ప్లాంట్​ పెట్టనుంది. ఈ ప్లాంట్​కు ఏడాదికి 2.40 కోట్ల టన్నుల స్టీల్​ ప్రొడక్షన్​ కెపాసిటీ ఉంటుంది. ఆర్సిలర్​ మిట్టల్​ సబ్మిట్​ చేసిన ప్లాన్​ను ఒడిశా ముఖ్యమంత్రి నవీన్​ పట్నాయక్​ నాయకత్వంలోని హైలెవెల్​ కమిటీ ఆమోదించింది. కొత్త స్టీలు ప్లాంట్​లో 24 వేల మందికి ఉద్యోగాలు ఇస్తారు. పరోక్షంగా మరింత మందికి ఉపాధి దొరుకుతుంది. ఏడాదికి 18.75 మిలియన్​ టన్నుల సిమెంట్​ను కూడా ఆర్సిలర్​ ప్లాంట్​ ఉత్పత్తి చేస్తుందని ఒడిశా ప్రభుత్వం ప్రకటించింది. చిన్న బిజినెస్​లను ప్రమోట్​ చేసేందుకు ఆర్సిలర్​ మిట్టల్​  డౌన్ స్ట్రీమ్​ ఇండస్ట్రీ పార్కునూ ఏర్పాటు చేస్తుంది. దిగుమతి చేసుకుంటున్న ప్రొడక్ట్స్​ను కొన్నింటినీ ఇక్కడే తయారయ్యేలా ఆర్సిలర్​ మిట్టల్​ చొరవ తీసుకుంటుందని ప్రభుత్వం పేర్కొంది.​ ఆర్సిలర్​ మిట్టల్​ ఈ ప్రాజెక్టును దశలవారీగా ఏడేళ్లలో పూర్తి చేస్తుందని వివరించింది. స్టీల్​ ప్లాంట్​తో పాటు ఈ ప్రాంతంలో చాలా యాన్సిలరీ యూనిట్లు ఏర్పాటయ్యే అవకాశాలూ కలుగుతాయని ఒడిశా ప్రభుత్వం  తెలిపింది.