నాట్కో లాభం రూ.369 కోట్లు

నాట్కో లాభం రూ.369 కోట్లు

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ 30తో ముగిసిన రెండో క్వార్టర్​లో నాట్కో ఫార్మా కన్సాలిడేటెడ్​ నికర లాభం ఆరు రెట్లు పెరిగి రూ.369 కోట్లకు చేరుకుంది.  హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు చెందిన ఈ ఫార్మా సంస్థ గత ఆర్థిక సంవత్సరం  జులై–సెప్టెంబర్ కాలంలో రూ.57 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. తాజా క్వార్టర్​లో మొత్తం ఆదాయం రూ. 1,061 కోట్లకు పెరిగిందని, అంతకు ముందు ఏడాది కాలంలో రూ. 453 కోట్లు వచ్చాయని నాట్కో ఫార్మా రెగ్యులేటరీ ఫైలింగ్‌‌‌‌‌‌‌‌లో తెలిపింది. ఫార్ములేషన్ ఎగుమతుల పెరుగుదల, దేశీయ వ్యవసాయ, రసాయన వ్యాపారంలో పెరిగిన అమ్మకాల కారణంగా కంపెనీ ఈ క్వార్టర్​లో బలమైన పనితీరు ఉందని తెలిపింది.