డీజిల్ కోసం ప్రాణాలు పోగొట్టుకుంటున్నప్రజలు

డీజిల్ కోసం ప్రాణాలు పోగొట్టుకుంటున్నప్రజలు

కొలంబో: శ్రీలంకలో పెట్రోల్, డీజిల్ కోసం రోజుల తరబడి లైన్ లో నిలబడి ప్రజలు ప్రాణాలు పోగొట్టుకుం టున్నారు. తాజాగా గురువారం మరొకరు చనిపోయారు. కలుతర జిల్లా అంగురువాతోటలోని బంక్ వద్ద 63 ఏండ్ల ట్రక్కు డ్రైవర్ ఐదు రోజుల పాటు లైన్ లో ఉన్నారని, ఆయన తన ట్రక్కులోనే చనిపోయారని పోలీసులు చెప్పారు. ఇప్పటి వరకు బంక్ ల వద్ద లైన్ లో నిలబడి చనిపోయినోళ్ల సంఖ్య 10కి చేరిందని తెలిపారు. వీరందరూ 43 నుంచి 84 ఏండ్ల మధ్య వాళ్లని పేర్కొన్నారు. వీరిలో ఎక్కువ మంది కార్డియాక్ అరెస్టుతో చనిపోయారన్నారు. పోయిన వారం కొలంబోలోని బంక్ వద్ద కొన్ని గంటల పాటు లైన్ లో ఉన్న 53 ఏండ్ల పెద్దాయన గుండెపోటుతో మరణించారని చెప్పారు.