
హైదరాబాద్ నడిబొడ్డున కాంగ్రెస్ నేత, మాజీ సీఎం దివంగత కొనిజేటి రోశయ్య కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. లక్డీకపూల్‌లో మెట్రో స్టేషన్ సమీపంలోని చౌరస్తాలో విగ్రహ ఏర్పాటును పరిశీలిస్తు్న్నారు. తొమ్మిది అడుగుల కాంస్య విగ్రహం ఏర్పాటు కోసం బిడ్‌లు ఆహ్వానిస్తూ టెండర్ నోటిఫికేషన్ విడుదల చేశారు.
జూలై 4న రోశయ్య జయంతి సందర్భంగా విగ్రహాన్ని ఆవిష్కరించాలని జీహెచ్ఎంసీ భావిస్తోంది జీహెచ్ఎంసీ. ఆలోపు విగ్రహం ఏర్పాటు చేయడంతోపాటు.. ఆ ప్రాంతంలో సుందరీకరణ పూర్తి చేయనున్నట్టు అధికారులు తెలిపారు.
ఇటీవల తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి రోశయ్య విగ్రహాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అందులో భాగంగా ఈ జయంతికి ఆయన కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో సుదీర్ఘకాలం పనిచేశారు రోశయ్య. రాజశేఖర్ రెడ్డి సీఎం గా ఉన్నపుడు ఆయనకు నమ్మకస్తునిగా, ముఖ్య సలహాదారుగా ఉన్నారు. మంత్రిగా, ముఖ్యమంత్రిగా, ఆ తర్వాత తమిళనాడు గవర్నర్ గా కూడా సేవలు అందించారాయన.